వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెకండ్ వరల్డ్‌వార్ నాటి బాంబు లభ్యం: ఎయిర్ పోర్ట్ క్లోజ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Japan airport closed after World War II bomb found
టోక్యో: జపాన్‌లోని ప్రముఖ విమానాశ్రయం మంగళవారం మధ్యాహ్నం మూతబడింది. రెండో ప్రపంచ యుద్ధం నాటి పేలని బాంబు ఒకటి కనిపించడంతో ఈ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. దీంతో సెందాయ్ విమానాశ్రయానికి రావాల్సిన, వెళ్లవలసిన 92 విమానాశ్రయాలు రద్దయ్యాయి. 250 కిలో గ్రాముల బాంబు విమానాశ్రయం రన్ వే సమీపంలో కనిపించింది. ఈ బాంబును అమెరికా ప్రయోగించినట్లుగా గుర్తించారు.

ఇది రెండో ప్రపంచ యుద్ధం నాటిది అని భావిస్తున్నారు. డిటోనేటర్స్ తదితర పరికరాలతో బాంబును పరిశీలిస్తున్నారు. దీనిని మరెక్కడకైనా తరలించవచ్చా లేక అక్కడే పేల్చాలా అనే కోణంలో దానిని పరిశీలిస్తున్నారు. బాంబు పరిసర ప్రాంతాల్లో పలు ఇళ్లు కూడా ఉన్నాయి. సెందాయ్ విమానాశ్రయం ఉత్తర జపాన్ ప్రాంతంలో ప్రధాన విమానాశ్రయం. గత సంవత్సరం వచ్చిన సునామీ కారణంగా ఈ విమానాశ్రయం కూడా దెబ్బతింది.

దీంతో దీనిని మరమ్మతులు చేయడానికి కొద్దికాలం మూసివేశారు. ఆ తర్వాత విమానాశ్రయం తెరుచుకున్నప్పటికీ ఇప్పటికీ మరమ్మతులు జరుగుతున్నాయి. బాంబును అక్కడే నిర్వీర్యం చేయాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశం కూడా ఉండటంతో అధికారులు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలను ఇళ్ల నుండి ఖాలీ చేయిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా ఎక్కువగా జపాన్ పైనే బాంబులు ప్రయోగించింది.

దీంతో ఇలాంటి పేలుడు పదార్థాలు ఇక్కడ లభించడం సాధారణమని అధికారులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఇలాంటివి దొరుకుతుంటాయని చెబుతున్నారు. ప్రధానంగా నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు భూమిని తవ్వుతుంటే ఎక్కువగా దొరుకుతుంటాయి.

English summary
A major airport in northern Japan was closed Tuesday after construction workers found an unexploded bomb believed to be from World War II.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X