జగన్ రాజకీయ వ్యూహాలు జైలు నుండే: యనమల

జైలునే ఆయన రాజకీయ వ్యూహాలకు వేదికగా మార్చుకున్నారని, ఆయనను కలుస్తున్న వారిలో ఎక్కువమంది రాజకీయ నాయకులే ఉన్నారని, నిబంధనలకు విరుద్దంగా జైల్లో జరుగుతున్న వ్యవహారాలపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తాను జైళ్ళ శాఖ డిజికి లేఖ రాసినట్లు చెప్పారు. జైల్లో ఖైదీకి వారంలో రెండుసార్లు మాత్రమే ములాకత్‌లు ఇవ్వాల్సి ఉండగా.. జగన్ విషయంలో దానిని పాటించడం లేదని ఆరోపించారు.
టిడిపి అధికారంలోకి వస్తే రైతుల రుణాలు అన్నింటినీ మాఫీ చేశామని టిడిపి నేత దాడి వీరభద్ర రావు స్పష్టం చేశారు. గత ఎన్నికల ముందు కూడా అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారని, కేంద్రం భయపడి కొంతవరకు రుణాల మాఫీ చేసిందని గుర్తు చేశారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తన హయాంలో పంచభూతాలను దోచేశారని, ఆఖరుకు తిరుమల ఏడు కొండలను రెండు కొండలుగా మార్చే ప్రయత్నం చేశారని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమావతి విమర్శించారు. ప్రజల సొమ్ము దోచేసినందుకు వారి శాపం, పంచభూతాలను కబ్జా చేసినందుకు వారి శాపం, పంచభూతాలను కబ్జా చేసినందుకు ఆ శాపం తగిలి వైయస్‌కు అలా అయిందేమో అన్నారు.












Click it and Unblock the Notifications