వర్షంలోనూ షర్మిల యాత్ర: గొర్రెలే బెట్టర్ అన్న బాబు

ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైనప్పటికీ చంద్రబాబు సర్కారును నిలదీయడం లేదన్నారు. సర్కారుతో కుమ్మక్కయి జగన్‌ను జైలుకు పంపించారని, బెయిల్ రాకుండా చేస్తోందన్నారు. చంద్రబాబు తన హయాంలో గ్యాస్ రేటు పెరగలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వైయస్ ప్రవేశ పెట్టిన పలు పథకాలు ఆయన ఆలోచనగా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. హంద్రినీవా ప్రాజెక్టు ద్వారా అనంత జిల్లాను సస్యశ్యామలం చేయాలని వైయస్ భావించారన్నారు.
విద్యార్థులను ప్రభుత్వం బిక్షగాళ్లను చేసిందని ఆరోపించారు. తాము ఇంతే చెల్లిస్తామని ఫీజుల చెల్లింబులో నిబంధనలు విధించడమేమిటని ప్రశ్నించారు. కాగా షర్మిల పాదయాత్రలో ఓ రైతు ఆమెకు వైయస్సార్ విగ్రహం ముందు జగన్ నడుస్తూ ఓ ఎడ్ల బండిలో నిలబడిన ఓ చిత్రాన్ని బహూకరించారు.
మహబూబ్ నగర్ లో చంద్రబాబు
రాష్ట్రంలో ఎమ్మెల్యేలను పశువుల్లా కొంటున్నారని మహబూబ్ నగర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. గొర్రెలే ఎమ్మెల్యేల కంటే ఎక్కువ విశ్వాసంగా ఉంటాయన్నారు. అక్రమంగా సంపాదించిన సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్ జగన్ పైన సిబిఐ ఇటీవల ఛార్జీషీటు దాఖలు చేసిందని, రూ.43 వేల కోట్ల మేర అవినీతికి పాల్పడినట్లు అందులో పేర్కొందన్నారు.












Click it and Unblock the Notifications