పురంధేశ్వరికి లైన్ క్లియర్: బ్రేక్ఐన ప్రమోషన్ వచ్చింది

ఇప్పుడు పనబాక పెట్రోలియం శాఖకు వెళ్లడంతో జౌళీ శాఖను పురంధేశ్వరికి స్వతంత్ర హోదాలో కేటాయించారు. దీంతో రాష్ట్రానికి మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో మరో ప్రాధాన్యతమున్న పదవి దక్కిందని చెప్పవచ్చు. బుధవారం అనుకోకుండా పనబాక లక్ష్మి ప్రమోషన్ పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు పురంధేశ్వరి కూడా అలాగే హఠాత్తుగా పదోన్నతి పొందారు.
ఏలూరు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివ రావు అలక పురంధేశ్వరి ప్రమోషన్‌కు బ్రేక్ వేసేలా చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పురంధేశ్వరి పని తీరుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఆమెకు ప్రమోషన్ వచ్చిందని చెప్పి కంగ్రాట్స్ చెప్పారట.
ఆమె సామర్థ్యాన్ని గుర్తించిన అధిష్టానం కేంద్రమంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధపడింది. అయితే ఆమెకు ప్రమోషన్ రాలేదు. దీనికి కావూరి అసంతృప్తే కారణమని వినిపించింది. పార్టీలోని అసంతృప్తులను చల్లార్చిన తర్వాత పురంధేశ్వరికి ప్రమోషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీలో ముఖ్యమైన పదవి ఇస్తామని కావూరిని, సొంత కంపెనీకి పోలవరం టెండర్లు కట్టబెడతామని రాయపాటిని బుజ్జగించారని అంటున్నారు. అసంతృప్తికి లోనుకాకుండా ఉండేందుకు పనబాకను కూడా ప్రమోషన్ ఇచ్చారు. ఇవన్నీ పురంధేశ్వరి ప్రమోషన్‌కు లైన్ క్లియర్ చేసినట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications