నేరం నాది కాదు, వైయస్ మంత్రి వర్గానిదే: ఐఏఎస్

తాను ప్రభుత్వ ఆదాయానికి గండిపడకూడదన్న ఉద్దేశ్యంతోనే దానిని వ్యతిరేకించానన్నారు. ప్రభుత్వం నిర్ణయం కోసం దానిని మంత్రి మండలి ముందుకు తీసుకు వెళ్లినప్పుడు మంత్రివర్గం తన అభిప్రాయాన్ని విస్మరించిందని చెప్పారు. తనను ఈ కేసులో ఉద్దేశ్య పూర్వకంగా ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
ఐటి కార్యదర్సిగా తాను పని చేశానని, మేధావులు తనను అభినందించారని, దీంతో దురుద్ధేశంతో తన ప్రతిష్ట దెబ్బతీయడానికి ఈ కేసులో ఇరికిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలతో కోర్టు విలువైన సమయాన్ని వృధా చేయడంతో పాటు న్యాయస్థానాన్ని తప్పు దోవ పట్టించడానికి ప్రయత్నించిన పిటిషనర్‌ను శిక్షించాలని రత్నప్రభ తన కౌంటర్ అఫిడవిట్‌లో కోర్టును కోరారు.












Click it and Unblock the Notifications