జూ ఎన్టీఆర్ సంతాపం: బోరున విలపించిన నటి కవిత

ఏడ్చిన నటి కవిత
టిడిపి నేత, నటి కవిత శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో మీడియాతో కంటతడి పెట్టుకుంటూ మాట్లాడారు. ఎర్రన్నాయుడు మృతిని తట్టుకోలేక పోతున్నామన్నారు. పార్టీలో తమకు నిత్యం సూచనలు చేసేవారని, పార్టీ కోసం, ప్రజల కోసం నిత్యం ఆయన తపించేవారన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలను తూచ తప్పకుండా పాటించిన వ్యక్తి ఎర్రన్నాయుడు అన్నారు.
మూడు దశాబ్దాల ప్రజా జీవితం
మూడు దశాబ్దాల ప్రజా జీవితంలో సమస్యలపై ఎంతో పోరాడారని, మరో మూడు నాలుగు దశాబ్దాలు ప్రజల కోసం పోరాడాల్సిన సమయంలో పోవడం బాధాకరమని మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. ఆయన జిల్లాకు, రాష్ట్రానికి ఎంతో చేశారని, ఆయన సేవలు కోల్పోవడం విచారకరమన్నారు.
బోరున విలపించిన కూతురు
తండ్రి మృతి విషయం తెలియగానే రాజమండ్రిలో ఉన్న ఎర్రన్నాయుడు కూతురు హుటాహుటిన శ్రీకాకుళం చేరుకున్నారు. విగత జీవిగా పడి ఉన్న తండ్రిని చూసి కూతురు భవాని బోరున విలపించారు. ఎర్రన్నాయుడు మృతికి కేంద్రమంత్రులు పళ్లం రాజు, గులాం నబీ ఆజాద్‌లు సంతాపం తెలిపారు.
కవిత నివాళులు
ఎర్రన్నాయుడు మృతదేహానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎర్రన్నాయుడు సేవలు కొనియాడదగ్గవి అన్నారు.












Click it and Unblock the Notifications