ఇంజనీరింగ్ కళాశాలపై రాళ్ల దాడి: ఎయిడ్స్ సోకిందని...

ఎయిడ్స్ వ్యాధి సోకిందని...
కరీంనగర్ జిల్లాలో మరో ఘోరం జరిగింది. సిరిసిల్లలో మున్సిపల్ సిబ్బంది మానవత్వం మరిచి ప్రవర్తించారు. లక్ష్మి అనే మహిళకు ఎయిడ్స్ రోగి సోకిందని తెలిసి ఆమెను చెత్త ఆటోలో తీసుకెళ్లి ఊరి అవతల వాగు వద్ద వదిలేశారు. ఈ విషయం తెలిసిన స్థానికులు వారిపై మండిపడ్డారు.
ఎయిడ్స్ వ్యాధి సోకిందని చెప్పి చెత్తకుప్పలో పడేయడమేమిటని ప్రశ్నించారు. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. సదరు మహిళ భర్త చనిపోవడంతో ఆమె భిక్షమెత్తుకొని జీవనం సాగిస్తోంది. ఆమె ఆరోగ్యం చెడిపోయింది. దీంతో ఆమెను ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి సిబ్బంది పట్టించుకోకపోవడంతో మున్సిపల్ సిబ్బంది ఆమెను అక్కడి నుండి తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. స్థానికులు తిరిగి ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.
ఇంజనీరింగ్ కళాశాలపై రాళ్ల దాడి
రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లా ఒంగోలు నల్లవాగులో గల్లంతైన ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతదేహాలు శనివారం లభ్యమయ్యాయి. విద్యార్థుల కోసం గాలింపు చేయడంలో కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందంటూ విద్యార్థుల బంధువులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆందోళనకారులు కళాశాల పైకి రాళ్లు రువ్వారు.












Click it and Unblock the Notifications