నీలం తుఫాను: దర్శకుడు గుణశేఖర్ 5 లక్షల విరాళం

నీలం తుఫాను కారణంగా రాష్ట్రంలో పలు జిల్లాలో నీట మునిగిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి తదితర జిల్లాల్లో పలు గ్రామాలు నీట మునిగాయి. లక్షల ఎకరాల పంటలు నీట మునిగాయి. ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇరవై ఐదు మందికి పైగా మృతి చెందారు. వేల కిలోమీటర్ల రోడ్లు పూర్తిగా ధ్వంసమై పోయాయి.
ఇలా నీలం సృష్టించిన బీభత్సం పలు జిల్లాలను కకలావికలం చేసింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేడు ముంపు ప్రాంతాల్లో సర్వేలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిన్న వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ నిన్న, నేడు పర్యటిస్తున్నారు. బాధితులను ఓదార్చుతున్నారు.












Click it and Unblock the Notifications