వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్‌పై దుమ్మెత్తిపోసిన బాబు, మాదిగలకు హామీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
మహబూబ్‌నగర్: రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం కావడానికి వైయస్ రాజశేఖర రెడ్డి పాలనే కారణమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తు చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపినిచ్చారు. పేదలకు న్యాయం జరగాలన్నదే తమ ధ్యేయమని, అందుకే పాదయాత్ర చేపట్టానని చెప్పారు.

మహబూబ్‌నగర్ జిల్లాలోని మల్లపురం గేట్ వద్ద చంద్రబాబు నాయుడు ప్రజల నుద్దేశించి మాట్లాడారు. తల్లిదండ్రులకు ఆడపిల్లలు భారం కాకుండా నిరుద్యోగభృతి కల్పిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని విమర్శించారు. రైతుల రుణమాఫీ ఎలా చేస్తానో చెప్పను, చేసి చూపిస్తానని అన్నారు. తమ పార్టీ పేదల పక్షంగా నిలబడి పోరుడుతుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.

సూరారం వద్ద ఎమ్మార్పీఎస్ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న బాబు వర్గీకరణ దిశగా తమ పార్టీ నిర్ణయం వెలువరిస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిధులు కాజేస్తూ కాంగ్రెస్ నేతలు ప్రజా ద్రోహులుగా మారరని చంద్రబాబు విమర్శించారు. నల్గొండజిల్లా, సూర్యాపేట మున్సిపల్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సహా ఆరువందల మంది కాంగ్రెస్ నేతలు బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. డీఎస్సీ ద్వారా లక్ష ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమ పార్టీదేనని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బుల వసూళ్ళకు పాల్పడుతూ ఇష్టానుసారం కళాశాలలకు అనుమతులిస్తుందని ఆయన ఆరోపించారు. అర్హత ఉన్న అభ్యర్ధులకు ఉద్యోగాలు లేకుండాపోయాయని చంద్రబాబు అన్నారు. జిల్లాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర 34వ రోజుకు చేరుకుంది. గురువారం ఉదయం కోయిల్‌కొండ మండలం సేరివెంకటాపురం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి విక లాంగులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు.

English summary
Telugudesam party president N Chandrababu Naidu has lashed out at YS Rajasekhar Reddy. He continued his Vastunna... Mekosam padayatra in Mahaboobnagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X