హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజమండ్రి లలిత ఉరఫ్ జయప్రద: రాంపూర్‌ కీ రాణి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలోని రాజమండ్రిలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన లలితా రాణి జయప్రదగా మారిపోయి సినీ ప్రపంచాన్ని ఏలారు. ఆ తర్వాత రాజకీయాల్లోనూ ఓ వెలుగు వెలిగారు. రాష్ట్రం కాని రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి అక్కడి రాంపూర్ నియోజకవర్గం నుంచి 2004లోనూ 2009లోనూ విజయం సాధించి లోకసభకు వెళ్లారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు 2006లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఇప్పుడు ఆమె రాజకీయ జీవితం గాలిలో దీపంలా ఉంది.

అమర్‌ సింగ్‌ను బలపరచడంతో ఆమె సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత అమర్ సింగ్ స్థాపించిన రాజకీయ పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేశారు గానీ సాధ్యం కాలేదు. అమర్ సింగ్ రాజకీయ సన్యాసం తీసుకున్నారు. జయప్రద తన ఇష్టమైన పార్టీలో చేరవచ్చునని ఆయన ప్రకటించారు. ఇప్పుడు ఏ పార్టీలో చేరాలనేది ఆమెకు సమస్యగా మారింది.

సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైనప్పటి నుంచి ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని అనుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆమె పలు మార్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీలో తిరిగి చేరడానికి ఆమె ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సతీమణి భువనేశ్వరి జయప్రదను తీవ్రంగా వ్యతిరేకించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

రాజమండ్రి లలితా రాణి: రాంపూర్‌ కీ రాణి

ఎన్టీ రామారావు సరసన యమగోల వంటి పలు హిట్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన జయప్రద 1994లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అధికార మార్పిడి సమయంలో నారా చంద్రబాబు నాయుడు వైపు వచ్చేశారు. 1996లో ఆమె టిడిపి తరఫున రాజ్యసభకు నామినేట్ అయ్యారు. తెలుగు మహిళ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు.

రాజమండ్రి లలితా రాణి: రాంపూర్‌ కీ రాణి

తెలుగుదేశం పార్టీ నుంచి తప్పుకున్న తర్వాత జయప్రద ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీలో చేరి ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ నుంచి మొదటిసారి 2004లో లోకసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత పార్టీ నాయకుడు ఆజంఖాన్‌ నుంచి తీవ్ర వ్యతిరేకతను, వివాదాలను ఎదుర్కుని 2009 ఎన్నికల్లో 30 వేల మెజారిటీతో అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.

రాజమండ్రి లలితా రాణి: రాంపూర్‌ కీ రాణి

తెలుగు అమ్మాయి జయప్రద ఉత్తరప్రదేశ్ రాంపూర్‌లో సాధారణ ప్రజానీకంతో మమేకమయ్యారు. ప్రజలతో మమేకం కావడానికి ఆమె వారి సంప్రదాయ వస్త్రధారణను కూడా పుణికి పుచ్చుకున్నారు. పలు హిందీ సినిమాల్లో నటించిన ఆమెకు హిందీలో ప్రజలతో కలిసిపోవడం పెద్ద సమస్యగా మారలేదు.

రాజమండ్రి లలితా రాణి: రాంపూర్‌ కీ రాణి

పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన అమర్ సింగ్‌కు ఆమె బాసటగా నిలిచారు. అత్యంత క్లిష్ట సమయంలో ఆమె అమర్ సింగ్‌కు మద్దతు నిలబడ్డారు. దాంతో జయప్రద సమాజ్‌వాదీ పార్టీ నుంచి 2010 ఫిబ్రవరి 2వ తేదీన బహిష్కరణకు గురయ్యారు.

English summary
Jayaprada began her political career with N T Rama Rao's Telugudesam Party in 1994, but she soon joined Chandrababu Naidu when he broke away from NTR. Then, she joined the Samajwadi Party, and got elected from Rampur in Uttar Pradesh in 2004. She was re-elected in 2009.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X