కరాచీ ఆర్మీ క్వార్టర్స్‌పై ఆత్మాహుతి దాడి: ఇద్దరు మృతి

పేలుడు కారణం ఆత్మాహుతిదళమే కావొచ్చునని తెలుస్తోంది. పేలుడు పదార్థాలతో కూడిన ట్రక్కును ఆత్మాహుతి దళ సభ్యుడు ఆర్మీ రేంజర్ హెడ్ క్వార్టర్ కార్యాలయం వద్ద పేల్చి వేశాడు. గాయలపాలైన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ఆర్మీ రేంజర్ హెడ్ క్వార్టర్ కరాచీలోని ఉత్తర నజిమాబాద్ ప్రాంతంలో ఉంది. ఈ పేలుడు పట్టణం మొత్తం వినిపించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. చుట్టుపక్కల ఉన్న పలు భవంతులు దెబ్బతిన్నాయి. కాగా పోలీసులు మంటలను గంటన్నరలో అదుపులోకి తీసుకు వచ్చారు.
స్మోక్ అంతా ఆకాశంలోకి వెళ్లింది. చనిపోయిన ఇద్దరిలో ఒకరు ఘటనా స్థలంలో మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇంకా అధికారిక ప్రకనట వెలువడలేదు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్టు చేసినట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications