ఆ కంపెనీతో సంబంధం లేదు, మార్పులేదు: రాయపాటి

పోలవరం టెండర్లు దక్కించుకున్న ట్రాన్సుట్రాయ్ కంపెనీ తనకు సంబంధించింది కాదని రాయపాటి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఏదైనా ఉంటే ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌ను అడగాలని సూచించారు. తనకు చెందిన ట్రాన్సుట్రాయ్ కంపెనీకి పోలవరం టెండర్లు దక్కాయని చెబుతున్నారని, అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఆ కంపెనీకి తనకు ఎలాంటి సంబంధం లేదని రాయపాటి అన్నారు.
కాగా పోలవరం టెండర్లు ట్రాన్సుట్రాయ్ కంపెనీకి దక్కిన విషయం తెలిసిందే. ఈ కంపెనీ రాయపాటికి చెందిందిగా వార్తలు వచ్చాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ఈ కంపెనీ రాయపాటిదిగా చెప్పారు. రాయపాటి సతీమణి ఈ కంపెనీ ఎండిలలో ఒకరిగా ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నింటిని రాయపాటి సాంబశివ రావు కొట్టి వేయడం గమనించదగ్గ విషయం.












Click it and Unblock the Notifications