వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీలో షర్మిల హోదా ఏంటి? జగన్ చాటు చెల్లెలిగానే...

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan - Sharmila
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఆ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ అరెస్టయినప్పటి నుండి ప్రారంభిస్తే ఇప్పటి వరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఆమె ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. ఉప ఎన్నికల సమయంలో ఆమె అందర్నీ ఆకట్టుకున్నారు. ఆమె మాట తీరు అందర్నీ కట్టిపడేసింది.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పేరుతో, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇందిర బాట పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో నిస్తేజం కనిపించింది. జగన్ జైలులో ఉన్నందున పార్టీని గాడిలో పెట్టే బాధ్యతను షర్మిల తన భుజానికెత్తుకున్నారు. పార్టీలోని నిస్పృహను తొలగించేందుకు షర్మిల రెడ్డి 3000 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రను చేపట్టారు.

ఇలాంటి షర్మిలకు ఇప్పటి వరకు పార్టీలో ఏ పదవి లేదు. దీంతో ఇది చర్చనీయాంశమైంది. పత్రికలలో రాసినా, బయట చర్చించుకున్నా షర్మిలను ఇంకా జగన్ సోదరిగానే చెబుతున్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కూడా దీనినే ప్రశ్నిస్తున్నాయి. షర్మిల ఏ హోదాతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని పలుమార్లు ఆయా పార్టీ నేతలు ప్రశ్నించారు.

తన సోదరుడి కోసం పార్టీ బాధ్యతను భుజానికెత్తుకున్న షర్మిల పార్టీ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపడతారని గతంలో వార్తలు వచ్చాయి. ఇతర పదవులకు కూడా ఆమె పేర్లను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు అవి ఫైనల్ కానట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి మాత్రం షర్మిల జగన్ సోదరిగానే పాదయాత్ర చేస్తోంది. సోదరుడు జైల్లో ఉన్నప్పుడు పార్టీ కోసం ఇంతగా కష్టపడుతున్న తన సోదరి షర్మిలకు జగన్ ఏ పదవి సృష్టించి కట్టబెడతారో చూడాలని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

English summary

 YSR Congress party chief YS Jaganmohan Reddy's sister Sharmila is doing padayatra to strengthen party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X