వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేం ఉన్నాం: షర్మిల, చిరంజీవి మోసగాడు: భూమన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bhumana Karunakar Reddy - Sharmila
చిత్తూరు/కర్నూలు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల రెడ్డి ఆదివారం పత్తికొండ నియోజకవర్గంలోని చిన్న హుళ్తి సమీపంలోని బిఈడి కళాశాల నుండి పాదయాత్రను ప్రారంభించారు. ఆమె పాదయాత్ర ఈ రోజు పదమూడు కిలోమీటర్లు సాగనుంది. పత్తికొండ శివార్లలో పాదయాత్ర చేస్తున్న సమయంలో పలువురు ఉల్లి రైతులు వచ్చి ఆమెను కలిశారు.

తమ సమస్యలను ఆమెకు విన్నవించుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించారని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రైతులు అసంతృప్తికి గురి కావొద్దని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం వచ్చాక అందర్నీ ఆదుకుంటామని చెప్పారు. అసెంబ్లీలో రైతుల సమస్యను తమ ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తారన్నారు.

చిరంజీవి అభివృద్ధి చేస్తాడా

కేంద్రమంత్రి చిరంజీవి పర్యాటక రంగాన్ని ఎలా అభివృద్ది చేస్తారని తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి చిత్తూరులో ప్రశ్నించారు. చిరంజీవి పచ్చి మోసగాడని మండిపడ్డారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తిరుపతి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు.

అలాంటి వ్యక్తి భారత పర్యాటక రంగాన్ని ఏవిధంగా అభివృద్ధి పరుస్తారని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే తిరుపతిని దత్తత తీసుకుంటానని చిరంజీవి అప్పట్లో ప్రకటించారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.

English summary
Tirupati MLA Bhumana Karunakar Reddy has blamed central minister Chiranjeevi on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X