భార్యను చంపి ఇంట్లో పాతిపెట్టిన భర్త, అరెస్టు

పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అతను తన తప్పును అంగీకరించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం తన భార్యను చంపేసి పాతి పెట్టినట్లుగా నిందితుడు అంగీకరించాడు.
తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సమీపంలో బోరువాకలో ముగ్గురు గిరిజన బాలికలపై అత్యాచారయత్నం జరిగింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిని ఓ ఆటో డ్రైవర్ రక్షించాడు.
చిత్తూరు జిల్లా పాకాల రైల్వే స్టేషన్ జంక్షన్‌లో రైలు ఎక్కుతూ జారిపడి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో మరో మహిళ గాయపడింది. గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం 108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications