వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి ఆఫర్ తిరస్కరించిన యడ్డీ, అర్ధరాత్రి జైట్లీ చర్చలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yeddyurappa
బెంగళూరు: డిసెంబర్ 10వ తేదిన కొత్త పార్టీ పెడతానని హల్ చల్ సృష్టిస్తున్న మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బిఎస్ యడ్యూరప్పను బుజ్జగించేందుకు పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ శనివారం రాత్రి యడ్యూరప్పను కూల్ చేసే ప్రయత్నాలు చేశారట. యడ్డీతో భేటీ అయిన జైట్లీ పార్టీని వీడవద్దని సూచించారట. పార్టీలో కోరుకునే పదవి ఇస్తామని యడ్యూరప్పకు హామీ ఇచ్చారట.

అయితే ఇందుకు యడ్యూరప్ప నిర్ద్వంధంగా తోసిపుచ్చినట్లుగా సమాచారం. తనకు పార్టీలో ఎలాంటి పదవులు అవసరం లేదని తేల్చి చెప్పారట. తనను పార్టీ ఇన్నాళ్లుగా నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడు కొత్త పార్టీ పెడతానని చెబితే బుజ్జగింపుల కోసం వచ్చారని యడ్డీ విమర్శించారట. తనకు 60 మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీల మద్దతు ఉందని యడ్యూరప్ప జైట్లీకి చెప్పారని సమాచారం.

అయితే తాను ప్రభుత్వాన్ని పడగొట్టనని, కొత్త పార్టీ పెడతానని, వచ్చే ఎన్నికల్లో మాత్రమే తన పార్టీ తరఫున పోటీ చేస్తామని జైట్లీకి తెలిపారని సమాచారం. యడ్డీని జైట్లీ ఓ రహస్య ప్రదేశంలో కలుసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే జైట్లీ మాత్రం పార్టీని వీడవద్దని, ఏ పదవి ఇచ్చేందుకైనా సిద్ధమని ఆఫర్ చేశారట. కానీ జైట్లీ ఎంతగా చెప్పినా యడ్యూరప్ప మాత్రం కొత్త పార్టీకే మొగ్గు చూపారని తెలుస్తోంది.

English summary
Karnataka former minister Yeddyurappa rejected Bharatiya Janaya Party's offer on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X