పండుగపూట విషాదం: బాణసంచా పేలి ఒకరి మృతి

బాణసంచా తయారు చేస్తున్న సమయంలో పేలుడు సంభవించినట్లు సమాచారం. అక్కడ అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కూడా విజయనగరం జిల్లాలో బాణసంచా పేలి ఆరుగురు మృతి చెందారు. అక్రమ బాణసంచా తయారీని అదుపు చేయకపోవడం వల్లనే ప్రమాదాలు సంభవిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
ఇదిలావుంటే, బాణసంచా కాలుస్తుండగా ఇటీవల ప్రమాదం సంభవించి ఏడుగురు పిల్లలు విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో గాయపడ్డారు. వారు విశాఖపట్నంలోని కెజిహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న పిల్లలను రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం పరామర్శించారు. వారికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేయవద్దని ఆయన సూచించారు.
ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. అయితే, దీపావళి మందుగుండుకు నిరుటి కన్నా గిరాకీ తగ్గింది.












Click it and Unblock the Notifications