హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంఘ్‌పరివార్‌కు మద్దతా: మజ్లిస్‌పై బొత్స, ఢిల్లీలో వేడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ సంఘ్ పరివార్‌కు మద్దతిస్తున్నదని మజ్లిస్ పార్టీ ఆరోపించడం శోచనీయమని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం అన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా కాంగ్రెసు పార్టీ ఎప్పుడూ వ్యవహరించలేదని, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తమ పార్టీపై వ్యతిరేక ముద్ర వేయడాన్ని తాను ఖండిస్తున్నానని చెప్పారు. దీపావళి ముందు భాగ్యలక్ష్మి ఆలయాన్ని అలంకరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

అలాగే మొన్న చేశారని, మజ్లిస్ పార్టీ దానిని రాద్దాంతం చేయడం సరికాదన్నారు. భాగ్యలక్ష్మి ఆలయ వ్యవహారం చాలా సున్నితమైనదని, హైకోర్టు తీర్పు మేరకే అధికారులు నడుచుకున్నారన్నారు. కాంగ్రెసు పార్టీ ఒక్కటే అసలైన లౌకిక పార్టీ అన్నారు. కాంగ్రెసు ఏ ఒక్క సామాజిక వర్గానికి కొమ్ము కాయదన్నారు. సంఘ్ పరివార్‌తో తాము చేతులు కలుపుతున్నామని వారు చెప్పడం ఎంత వరకు సమంజసమన్నారు.

మతసామరస్యం కోసం తాము అహర్నిషలు కృషి చేస్తున్నామన్నారు. మజ్లిస్ అలా ఆరోపించడానికి అవగాహన లోపమే కారణం కావొచ్చన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు తనకు మిత్రుడు అని ఇక నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మిత్రుడు అని అసదుద్దీన్ చెప్పారని, వ్యక్తిగతంగా అలా అనడం ఎంత వరకు సమంజసం అన్నారు.

మత ఘర్షణల్లో నష్టపోయిన వారికి తాము ఆర్థిక సహాయం చేశామని, అన్ని విధాలుగా ఆదుకున్నామన్నారు. సమస్యలేమైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాల్సింది పోయి అసదుద్దీన్ సున్నిత సమస్యపై ఇలా స్పందిస్తారని తాము భావించలేదన్నారు. సంగారెడ్డి అల్లర్ల బాధితులకు నష్టపరిహారం ఇచ్చామన్నారు.

సిద్ధాంతాలను నమ్ముకున్న పార్టీ

దేశంలో సిద్ధాంతాలను నమ్ముకున్న పార్టీ కాంగ్రెసు ఒక్కటే అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. సిద్ధాంతాల కోసం అధికారాన్ని వదులుకున్న పార్టీ కాంగ్రెస్ అన్నారు. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెసు లౌకిక వాదాల సిద్ధాంతంపైనే పుట్టిందన్నారు. కాంగ్రెసును ఓడించే సత్తా ఎవరికీ లేదన్నారు.

చిన్న చిన్న కారణాలు చూపి మద్దతు ఉపసంహరించుకోవడం సరికాదని, ఇన్ని రోజులుగా కాంగ్రెసుకు అంటని మతతత్వం ఈ వారంలోనే అంటిందా అన్నారు. కాంగ్రెసు పార్టీపై మజ్లిస్ పార్టీ చేసిన ఆరోపణలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మజ్లిస్ సవాళ్లు చేయడం సరికాదన్నారు. మజ్లిస్ మద్దతు లేకుండా కాంగ్రెసు అనేకసార్లు గెలిచిందని, మద్దతుపై ఆ పార్టీ పునరాలోచించుకోవాలని సూచించారు. కాంగ్రెసు లౌకికవాద పార్టీ అని నిందలు వేయడం మానుకోవాలని హితవు పలికారు.

మరోవైపు మజ్లిస్‌ను ఎలా దారికి తెచ్చుకోవాలనే అంశంపై కాంగ్రెసు పార్టీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. వార్ రూంలో పార్టీ నేతలు గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్, చిదంబరం, వాయలార్ రవి భేటీ అయ్యారు. వారు దాదాపు గంటసేపు చర్చించారు. మజ్లిస్‌ను ఎలా దారికి తెచ్చుకునే అంశంతో పాటు ముఖ్యమంత్రి మార్పుపై కూడా వివరణ ఇవ్వాలని చర్చించినట్లుగా తెలుస్తోంది.

English summary
PCC chief Botsa Satyanarayana condemned MIM chief Asaduddin Owaisi's allegations against Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X