హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నన్నెందుకు అరెస్ట్ చేశారు: కిరణ్‌కు పరిపూర్ణానంద ప్రశ్న

By Srinivas
|
Google Oneindia TeluguNews

Paripoornananda Swamy
హైదరాబాద్: తనను ఎందుకు అరెస్టు చేశారో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామీ బుధవారం ప్రశ్నించారు. పోలీసులు తనపై ముంబయి ఘటన ఉగ్రవాది కసబ్ కంటే హీనంగా చూశారని మండిపడ్డారు. తనను అరెస్టు చేయడంపై హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద తమను దర్శనానికి అనుమతించక పోవడమే కాకుండా అరెస్టు చేయడంపై కిరణ్ వెంటనే సమాధానం చెప్పాలన్నారు.

లేదంటే తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని హెచ్చరించారు. భాగ్యలక్ష్మి ఆలయం వ్యవహారంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. తనను అరెస్టు చేయడంతో తన సాధు మనసు ఆవేదన చెందిందన్నారు. లౌకికవాదం పేరుతో హిందూవాదాన్ని అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. హిందువుల దేవాలయాలు కూలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ప్రార్థనా మందిరాల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. ప్రతి హిందువు హృదయం గాయపర్చేలా డిసిపి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. చార్మినార్ కేవలం చారిత్రక కట్టడమేనని, దానికి కాల పరిమితి ఉంటుందని కానీ దైవానికి ఉండదనే విషయం తెలుసుకోవాలన్నారు. ఆలయ గోపురాలు కూలుతున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలని పరిపూర్ణానంద నిలదీశారు.

మైనార్టీలను బుజ్జగించడం, వారి మందిరాల కోసం కోట్లు ముట్టజెప్పడమే లౌకికవాదమా అని ప్రశ్నించారు. కోట్లాది మంది భక్తుల విశ్వాస కేంద్రమే దైవం అని దానిని వివాదాస్పదం చేయవద్దన్నారు. మైనార్టీలను బుజ్జగించేందుకు తమను ఆలయాలకు అనుమతించక పోవడం విడ్డూరమన్నారు. హిందువుల దర్శనానికి అడ్డగించడం ఇతర మతాలకు వంత పాడటమేనని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

English summary
Sri Peetham Paripoornananda Swamy has questioned CM Kiran Kumar Reddy why police arrested him at Bhagyalaxmi Temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X