హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గీతా రెడ్డిపై వ్యాఖ్యల ఎఫెక్ట్: కోదండరామ్‌పై కేసు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై కేసు నమోదైంది. మెదక్ జిల్లాలోని జహీరాబాద్ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసును పురస్కరించుకుని పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

మంత్రి గీతా రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కోదండరాంపై తక్షణం కేసు నమోదు చేయాలని దళిత సంఘాలు డిమాండు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణాకోసం మంత్రి గీతా రెడ్డి కదలి రావడంలేదని ఆక్షేపించడంలో భాగంగా కోదండరాం చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉండడంతో వివాదం చెలరేగింది.

తన వ్యాఖ్యలను సరిగా అర్థం చేసుకోలేదని కోదండరాం ఆక్షేపిస్తే, మంత్రి గీతా రెడ్డికి కోదండరాం చేసిన వ్యాఖ్యల సిడిలు కూడా ఆందడంతో ఆమె వాటిని చూసి తీవ్రంగా స్పదించారు. కోదండరాం రెడ్డి అంటూ, చదువుకున్న వ్యక్తి, చదువు చెప్పవలసిన వ్యక్తి మాట్లాడే పద్ధతి ఇదేనా అని కూడా ఆమె ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కోదండరాంపై కేసు నమోదు అయ్యింది.

కాగా, చాలా రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావుతో కోదండరామ్ భేటీ కాబోతున్నారు. రేపు శుక్రవారం సాయంత్రం కెసిఆర్ కోదండరామ్‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఇరువురు నేతల మధ్య చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. తానే కోదండరామ్‌ను దూరం పెట్టినట్లు కెసిఆర్ చెప్పారు కూడా.

English summary
Case booked against Telangana JAC chairman Kodandaram for making unwanted comments on minister Geetha Reddy, Meanwhile Kodandaram will meet Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X