ఎవరు పిలిచారు: కెసిఆర్‌పై నిప్పులుచెరిగిన మోత్కుపల్లి

తెలుగుదేశం పార్టీకి తెలంగాణపై స్పష్టమైన వైఖరి ఉందన్నారు. కేంద్రాన్ని అఖిలపక్ష సమావేశానికి ఎందుకు డిమాండ్ చేయడం లేదన్నారు. మహబూబ్ నగర్ ప్రజలు పార్లమెంటు సభ్యుడిగా గెలిపిస్తే పార్లమెంటులో ఆయన తెలంగాణ కోసం ఏం మాట్లాడారో చెప్పాలన్నారు. కెసిఆర్ తన తనయుడు, కూతురు, అల్లుడి కోసం తాపత్రయ పడుతున్నారు తప్ప తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న విద్యార్థుల కోసం ఆలోచించడం లేదన్నారు.
కెసిఆర్ దుర్మార్గాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నందున కెసిఆర్ మరోసారి బయటకు వచ్చారన్నారు. వచ్చే ఎన్నికల్లో బిసిలకు వంద సీట్లు ఇచ్చి తీరుతామన్నారు. తెలంగాణలో పట్వారీ వ్యవస్థను రద్దు చేసి అధికార వికేంద్రీకరణ చేసిన ఘనత టిడిపిదే అన్నారు. కోదండరామ్ మంత్రి గీతారెడ్డి పట్ల అమానుష వ్యాఖ్యలు చేయడం సరికాదని మోత్కుపల్లి అన్నారు. ఢిల్లీలో జరిగిన విషయాలపై కెసిఆర్ ఎప్పుడూ నిజాలు చెప్పలేదన్నారు.
కోదండరామ్ వ్యాఖ్యలు సరికాదు
గీతారెడ్డిపై కోదండరామ్ వ్యాఖ్యలు సరికాదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కుందూరు జానా రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల గీతారెడ్డి చాలా బాధపడ్డారన్నారు. ఆ వ్యాఖ్యలు సంస్కారహీనమైనవన్నారు. జెఏసి నేతలు ఇతరుల మనసులను గాయపర్చడం సరికాదన్నారు. సాగర్ నీటి విడుదలపై ఈ నెల 19 సమావేశం జరుగుతుందని, నిర్ణయం ఆ రోజు లేదా 20న వెల్లడవుతుందన్నారు.
కోదండరామ్ క్షమాపణ
మంత్రి గీతా రెడ్డి పట్ల తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే మరోసారి క్షమాపణ కోరుతున్నానని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. తన వ్యాఖ్యల్లో తప్పుంటే మన్నించాలని, ఇంతటితో ఈ వివాదం ముగించాలని కోరుకుంటున్నానన్నారు. భవిష్యత్తులో మంత్రులపై ఒత్తిడి తెస్తామన్నారు. సాయంత్రం కెసిఆర్‌తో చర్చించాక భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. జహీరాబాద్ ప్రసంగంలో తప్పులు దొర్లాయని, తన వ్యాఖ్యలు తనకే మనస్థాపం కలిగించాయని, సహృదయంతో వదిలేయాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications