పాతబస్తీ ఉద్రిక్తం: రాళ్ల వర్షం, బాష్పవాయు ప్రయోగం

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ శుక్రవారం మరోసారి ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం ఓవైపు ప్రార్థనలు, మరోవైపు చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయం వద్ద పూజల నేపథ్యంలో భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే మక్కా మసీదు వద్ద ప్రార్థనల అనంతరం అల్లరి మూకలు చెలరేగిపోయాయి. ప్రార్థనల అనంతరం పలువురు ఆందోళనకారులు పోలీసుల పైన, మీడియా పైన రాళ్లు రువ్వారు.

Violence breaks out in old Hyderabad again

పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పరిస్థితిని సరిదిద్దే ప్రయత్నాలు చేశారు. అయితే అల్లరిమూకలు ఎంతకూ తగ్గక పోవడంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఆందోళకారులు మీడియాకు, పోలీసులకు చెందిన పలు వాహనాలను ధ్వంసం చేశారు. మూడు నాలుగు వాహనాలకు నిప్పు పెట్టారు. పలు బైకులు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల ఆంక్షలను జవదాటారు.

ముందస్తు జాగ్రత్తగా పోలీసులు చార్మినార్ పరిసరాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. సిసి కెమెరాల ఆధారంగా అల్లరి మూకలపైన పోలీసులు చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రాళ్ల దాడిలో ఎసిపి స్వల్పంగా గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో మరింతమంది పోలీసులను మోహరించారు. సాయంత్రం వరకు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. ఎవరూ ఎలాంటి ఆవేశాలకు లోనుకావొద్దని హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పిలుపునిచ్చారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలవాలన్నారు.

వదంతులు ఎవరూ నమ్మవద్దని సమాచార శాఖ కమిషనర్ చంద్రవదన్ విజ్ఞప్తి చేశారు. పాతబస్తీ ప్రశాంతంగానే ఉందన్నారు. ప్రజలు అందరూ సంయమనంతో ఉండాలని, పరిస్థితి అంతా అదుపులోనే ఉందని ఆయన చెప్పారు. పరిస్థితిని ఎప్పటికి అప్పుడు సమీక్షిస్తున్నామని సిపి అనురాగ్ శర్మ చెప్పారు.

మజ్లిస్ - కాంగ్రెసు డ్రామా

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి, యూపిఏ ప్రభుత్వానికి మజ్లిస్ మద్దతు ఉపసంహరణ ఓ డ్రామా అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మజ్లిస్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే ధైర్యం కాంగ్రెసు ప్రభుత్వం చేయలేదన్నారు. మజ్లిస్‌ను ప్రసన్నం చేసుకునేందుకు హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు కాంగ్రెసు నేతలు మోకరిల్లారని ధ్వజమెత్తారు. భాగ్యలక్ష్మి ఆలయం వివాదం కొత్తగా వచ్చింది కాదని ఇది 30 ఏళ్లుగా ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+