హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ సేనా నాయకులు వీరే: దూకుడే పని

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పార్టీని నడిపించే విషయంలో, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు అనుకూలంగా దూకుడు ప్రదర్సించే నాయకులు పార్టీలో ఉన్నారు. పార్టీకి అవసరమైన బలాన్ని సంతరించి పెట్టడంలో, ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో వీరు చూపే తెగువ పార్టీకే కాకుండా కెసిఆర్‌కు ఎనలేని సత్తాను సంతరించిపెడుతోంది.

కెసిఆర్ సేనా నాయకులు వీరే

కెసిఆర్‌కు మేనల్లుడైన హరీష్ రావు మొదటి నుంచీ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన ప్రత్యర్థులను తన మాటలతో ఎదుర్కోవడంలో దిట్ట. అలాగే, వివిధ శ్రేణులను పార్టీకి అనుకూలంగా మలచడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తారు. తెలంగాణవ్యాప్తంగా తిరిగి కెసిఆర్‌కు, పార్టీకి వివిధ వర్గాలను తన నైపుణ్యం ద్వారా అనుకూలం చేస్తుంటారు.

కెసిఆర్ సేనా నాయకులు వీరే

ఈయన విద్యార్తి దశలో ప్రగతిశీల ప్రజాతంత్ర విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు)లో పనిచేశారు. ప్రజాశ్రేణులను సంఘటితం చేయడంలో, వారిని తమ వైపు తిప్పుకోవడంలో ఆయనకు ప్రావీణ్యం ఉంది. విద్యార్థి నేతలను, కార్యకర్తలను తెరాసకు అనుకూలంగా తిప్పడంలో ఆయనది ప్రధాన పాత్ర అంటారు. ఆయన తెరాస శానససభా పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. తన అధ్యయనం ద్వారా ప్రత్యర్థులను తిప్పికొట్టడంలో దిట్ట.

కెసిఆర్ సేనా నాయకులు వీరే

అమెరికా నుంచి తండ్రి కెసిఆర్‌కు తోడునీడగా ఉండడానికే ఆయన రాష్ట్రానికి వచ్చారు. అప్పటి నుంచి ఆయన తెరాసలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం నుంచి శానససభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కెసిఆర్ తనయుడిగా ఆయనకు పార్టీ శ్రేణుల నుంచి మద్దతు ఉంటుంది. తెలంగాణకు సంబంధించిన అంశాలపై విపరీతంగా అధ్యయనం చేసి, తన వాదనా పటిమను పెంచుకున్నారు. ఎన్టీ రామారావుపై అభిమానంతో కెసిఆర్ తన కుమారుడికి తారకరామారావు అని పేరు పెట్టుకున్నారు. ఇంటి పేరుతో కలిసి అది కెటి రామారావుగానూ కెటిఆర్‌గాను అయింది.

కెసిఆర్ సేనా నాయకులు వీరే

ఈయన కూడా గతంలో పిడిఎస్‌యులో పనిచేసారు. ప్రజలను సంఘటితం చేయడంలో ఆయన చురుగ్గా ఉంటారు. విశేషమైన అధ్యయనం వల్ల ప్రత్యర్థులను ఎదుర్కునే సత్తా ఆయనకు ఉంది. కెసిఆర్‌కు ఎల్లవేళలా సన్నిహితంగా ఉంటూ తగిన విషయాలను అందించడంలో ఆయనది ప్రధాన పాత్ర.

కెసిఆర్ సేనా నాయకులు వీరే

ప్రజా గాయకుడిగా పేరున్న దెంచనాల శ్రీనివాస్ కెసిఆర్‌కు ఆంతరగింకుడు. కెసిఆర్ ప్రతి అడుగు వెనక ఆయన ఉంటాడని అంటారు. వివిధ విషయాలను సేకరించి ఆయన కెసిఆర్‌కు అందిస్తుంటారని చెబుతారు. కెసిఆర్ పాల్గొనే ప్రతి సభలో ఆయన వేదిక మీద ఉంటారు. తెలంగాణ పాటలను రాసి, పాడడంలో ఆయనకు ప్రజల్లో విశేషమైన ఆదరణ ఉంది.

కెసిఆర్ తన ఇష్టానిష్టాలకు, తన వ్యూహాలకు, ఎత్తుగడలకు అనుగుణంగా పార్టీని నడిపిస్తుంటే అందుకు అనుగుణంగా బయట కార్యాచరణకు వీరు దూకుతుంటారు. వారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది శాసనసభ్యులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, కెటి రామారావు. ఆయనకు ఆంతరంగికులుగా వ్యవహరించేవారిలో జగదీశ్వర్ రెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తారు. అలాగే నాయని నర్సింహా రెడ్డి, మధుసూదన్ ఆయనకు సన్నిహితంగా మెలుగుతూ తగిన సాధన సామగ్రిని అందిస్తుంటారు. వీరిద్దరు పార్టీ సంస్థాగత వ్వహారాలను చూస్తుంటారు.

English summary
Telangana Rastra Samithi president K Chandrasekhar rao has an active team to continue struggle. The team will play a key role in all aspects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X