జగన్‌కు బుద్ధి చెప్తాం, డిపాజిట్లు దక్కలేదు కానీ: ఈటెల

తెలంగాణలో మళ్లీ వైయస్ నాటి దోపిడీ రాజ్యం తీసుకు వస్తారా అని వైయస్సార్ కాంగ్రెసును ప్రశ్నించారు. ప్రజలందరికీ అరచేతిలో బెల్లం పెట్టి నాకించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్ పాలన గురించి ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజాం సుగర్స్ పైన విచారణ జరిపిస్తానన్న వైయస్ ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక నివేదికలను తొక్కిపెట్టారని ఆరోపించారు. వైయస్ 2004లో తెలంగాణ ఇస్తామని చెప్పారని, ఆ తర్వాత తెలంగాణను అడ్డుకున్నారన్నారు.
జగన్ ఎంపీగా ఉంటూ తెలంగాణకు వ్యతిరకంగా పార్లమెంటులో ప్లకార్డు పట్టుకున్నారని, తెలుగుదేశం పార్టీతో పాటు వైయస్సార్ కాంగ్రెసు కూడా తెలంగాణ వ్యతిరేక పార్టీ అన్నారు. అదో దోపిడీ పార్టీ అన్నారు. పన్నెండేళ్లుగా ప్రజల పక్షాన ఉన్న పార్టీ ఏదో తెలంగాణ ప్రజలకు తెలుసునన్నారు. తెరాసకు వంద సీట్లు కాదు వంద ఓట్లు కూడా రావని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అనడం విడ్డూరంగా ఉందన్నారు.
పడుకుందనుకున్న పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని, పరుగులు పెడుతున్న పార్టీని పాతాళానికి ప్రజలు తొక్కేశారన్నారు. తమ జోలికి టిడిపి నేతలు వస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ఉప ఎన్నికల్లో కనీస ఓట్లు కూడా దక్కించుకోలేని టిడిపి తమను అనడమేమిటన్నారు. 2009లో తమ సీట్లు పది ఉంటే ఇప్పుడు 20కి పెరిగిందని, టిడిపికి 2009లో 90 సీట్లు ఉంటే ఇప్పుడు ఎంతకు తగ్గుతుందో చూడాలన్నారు. ఓ వైపు బాబు పాదయాత్ర చేస్తుంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications