వైయస్ జగన్ పార్టీలోకి న్యూస్ రీడర్ రాణీ రుద్రమ

రాష్ట్రం మొత్తం వైయస్ జగన్ వెంటే ఉందన్నారు. తంబళ్లపల్లి, పలమనేరు నియోజకవర్గాలలో బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్పారు. అంతకుముందు వారు మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల వల్లనే తాము వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైఖరిని ఆయన తప్పు పట్టారు. తమను టిడిపి బహిష్కరించడం కాదని, టిడిపినే రాష్ట్ర ప్రజలు ఎప్పుడో బహిష్కరించారన్నారు.
చిత్తూరు జిల్లాలో త్వరలో జరిగే బహిరంగ సభలో తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతానని ప్రకటించారు. రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. అందుకే తాను జగన్ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. మైనార్టీలో పడిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో టిడిపిలో చంద్రబాబు ఒక్కరే మిగులుతారన్నారు. ప్రజల అభీష్టం మేరకే తాము జగన్ పార్టీలో చేరుతున్నామన్నారు.












Click it and Unblock the Notifications