హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముందస్తు: చంద్రబాబును ఫాలో అవుతున్న నేతలు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సొంత పార్టీని బలోపేతం చేసుకునేందుకో, నియోజకవర్గంలో కోల్పోయిన పట్టును తిరిగి సాధించేందుకే లేక మరో కారణమో ఏదైనా రాష్ట్రానికి చెందిన నేతలు రోడ్డెక్కుతున్నారు. ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్రతో ప్రారంభమైన యాత్రల పర్వం జోరందుకుంది. చంద్రబాబు పాదయాత్రకు ప్రజల నుండి మంచి స్పందన కనిపించింది.

ముందస్తు: బాబును ఫాలో అవుతున్న నేతలు!

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో రాష్ట్రంలో యాత్రల కాలం ప్రారంభమైంది. బాబు వస్తున్నా మీకోసం పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తున్న ప్రస్తుత తరుణంలో పార్టీ పరిస్థితులు బాగా లేక కొందరు, పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు మరికొందరు రోడ్డెక్కుతున్నారు.

ముందస్తు: బాబును ఫాలో అవుతున్న నేతలు!

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలులో ఉండటంతో ఆయన సోదరి షర్మిల పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు తీసుకుంది. మహిళ అయినప్పటికీ ఆమె మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రకు సిద్ధపడింది.

ముందస్తు: బాబును ఫాలో అవుతున్న నేతలు!

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆవశ్యకతను తెలియజేసేందుకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి వచ్చే జనవరిలో సంగారెడ్డి నుండి ఢిల్లీకి పాదయాత్ర చేపట్టనున్నారు. నిత్యం కెసిఆర్ అంటే విరుచుకుపడే ఆయన తన పట్టును పెంచుకునే ఉద్దేశ్యంలో భాగంగా యాత్ర చేపడుతున్నారు.

ముందస్తు: బాబును ఫాలో అవుతున్న నేతలు!

బైరెడ్డి రాజశేఖర రెడ్డి రాయలసీమ రాష్ట్రం కోసం, రాయలసీమ హక్కుల కోసం అంటూ పాదయాత్ర చేపట్టారు.

ముందస్తు: బాబును ఫాలో అవుతున్న నేతలు!

ప్రతిపక్షాలు బలోపేతం కోసం పాదయాత్ర చేస్తుంటే అధికార పార్టీ నేత కూడా విజయ యాత్ర పేరుతో పాదయాత్ర నిన్నటి నుండి ప్రారంభించారు. మంత్రి రఘువీరా రెడ్డి హంద్రీనీవా ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభించిన తర్వాత భగీరథ విజయ యాత్ర పేరుతో పదిరోజుల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.

ముందస్తు: బాబును ఫాలో అవుతున్న నేతలు!

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పల్లెబాట పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. కేవలం సెంటిమెంట్ మాత్రమే కాకుండా స్థానిక ప్రజల సమస్యల పైన కూడా స్పందించాలని పార్టీ నేతలకు, పార్టీ ప్రజా ప్రతినిధులకు సూచించారు.

దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చంద్రబాబు వస్తున్నా మీకోసంకు ధీటుగా షర్మిలచే మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రారంభింప చేశారు. రాయలసీమ హక్కుల కోసం అంటూ కర్నూలు జిల్లా నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా పాదయాత్ర చేశారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టును నెరవేర్చామని చెబుతూ మంత్రి రఘువీరా రెడ్డి నిన్నటి(ఆదివారం) నుండి భగీరథ విజయయాత్ర చేపట్టారు. ఈయన యాత్ర పదిరోజుల పాటు సాగనుంది.

మెదక్ జిల్లా సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) ప్రాణహిత ప్రాజెక్టు కోసం సంగారెడ్డి నుండి ఢిల్లీ వరకు పాదయాత్ర చేస్తానని చెప్పారు. బాబు వస్తున్నా మీకోసం పాదయాత్రకు కొనసాగింపుగా ఆయా నియోజకవర్గాలలో టిడిపి పల్లెపల్లెకు టిడిపి చేపడుతోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా పార్టీ బలోపేతం కోసం పల్లెబాట పట్టాలని నిర్ణయించుకున్నారు.

English summary
All the party leaders in Andhra Pradesh are doing yatras for interm poll fear.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X