కాంగ్రెస్‌లోకి తెలంగాణ తెలుగుదేశం రెబల్ ఎమ్మెల్యే!

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితుడు అయిన శాసనమండలి సభ్యుడు రంగారెడ్డితో వేణుగోపాల చారి సోమవారం భేటీ అయ్యారు. ఈ విషయమై మీడియా ప్రశ్నించగా.. కాంగ్రెసు పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే తాను ఆ పార్టీలో చేరే విషయమై ఆలోచిస్తానని చెప్పినట్లుగా సమాచారం. అయితే ఆయన కాంగ్రెసు పార్టీలో చేరేందుకు సిద్ధమై పోయారనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి.
వేణుగోపాల చారి 2009 సాధారణ ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం లేదని ఆరోపిస్తూ ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. పార్టీ వైఖరితో విభేదించారు. ఆయన నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి గ్రూపులో ఉన్నారు. ఆ గ్రూపులోని జోగు రామన్న, హరీశ్వర్ రెడ్డిలు తెరాసలో చేరారు.
నాగం జనార్ధన్ రెడ్డి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. వేణుగోపాల చారి టిడిపి రెబల్‌గా కొనసాగారు. గత కొంతకాలంగా ఆయన తెరాసలోకి వెళ్తారని, బిజెపిలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఆయన కేంద్రం తెలంగాణ ఇస్తే కాంగ్రెసులోకి వెళ్తానని ప్రకటించడం గమనార్హం. అయితే అదిలాబాద్ జిల్లా సీనియర్ నేత ఇంద్రకరణ్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లడంతో వేణుగోపాల చారి కాంగ్రెసులోకి దూకేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications