పార్టీలు సరే, కెసిఆర్ తెలంగాణ ప్రత్యర్థులు వీరే...
హైదరాబాద్: చర్చల పేరుతో చాలా కాలం విరామం తీసుకున్న తర్వాత తిరిగి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి, పార్టీని బలోపేతం చేయడానికి సిద్ధపడిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు ప్రత్యర్థులు చాలా మందే ఉన్నారు. పాత ప్రత్యర్థులకు కొత్త ప్రత్యర్థులు తోడయ్యారు. పాత మిత్రుడు తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్‌ను ఆయన తిరిగి చేరదీశారు. తెలంగాణ ఉద్యోగుల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన స్వామిగౌడ్‌ను నేరుగా పార్టీలోకి తీసుకున్నారు.

ఓయు విద్యార్థి జెఎసి
తెలంగాణ ఉద్యమానికి గుండె కాయగా ఉంటూ వస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి జెఎసి రాజకీయ పార్టీని స్థాపించడానికి సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఒయు జెఎసి నాయకులు ఆదివారం ప్రకటించారు. తెరాసకు, బిజెపికి ఒయు జెఎసి మద్దతు ఇస్తూ వస్తోంది. డిసెంబర్ 9వ తేదీన రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఢిల్లీలో ప్రకటన చేస్తామని చెప్పారు. ఇటువంటి దిశగా విద్యార్థులు ప్రయాణం చేయడం చరిత్రలో 118 ఏళ్ల తర్వాత జరుగుతోంది. ప్రస్తుత రాజకీయ పార్టీల మీద నమ్మకం లేకనే తాము పార్టీని పెట్టదలుచుకున్నట్లు కృషాంక్ చెప్పారు. ఇది తెరాసకు కూడా వ్యతిరేకమే అవుతుంది.

టిజెఎసి కో చైర్మన్ శ్రీనివాస గౌడ్ ఆగ్రహం
కెసిఆర్ తీరుపై తెలంగాణ జెఎసి కో చైర్మన్ శ్రీనివాస గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ జెఎసితో ప్యాచప్ చేసుకోవడానికి కోదండరామ్ సహా ఇతర టిజెఎసి నాయకులను అహ్వానించిన కెసిఆర్ శ్రీనివాస గౌడ్‌ను పక్కన పెట్టారు. దీనిపై శ్రీనివాస గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జెఎసిని చీల్చడానికి కొంత మంది ప్రయత్నిస్తున్నారు ఆయన వ్యాఖ్యానించారు. అయితే, శ్రీనివాస గౌడ్‌తో కెసిఆర్ మాట్లాడారని, ఆ తర్వాత శ్రీనివాస గౌడ్ తన దూకుడును తగ్గించారని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీకి మందకృష్ణ మాదిగ మద్దతు
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పియస్) వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ మరోసారి కెసిఆర్‌ను టార్గెట్ చేసుకున్నారు. ఇది వరకు కూడా మందకృష్ణ మాదిక కెసిఆర్‌ను దుమ్మెత్తిపోశారు. ఆ తర్వాత కలిసిపోయారు. మంత్రి గీతారెడ్డిపై కోదండరామ్ చేసిన వ్యాఖ్యలను సమర్థించారంటూ ఆయన కెసిఆర్‌పై మాటల ఈటెలు విసురుతున్నారు. రాబోయే తెలంగాణ రాష్ట్రంలో దొరల ఆధిపత్యం ఎలా ఉంటుందో కెసిఆర్ మాటలు తెలియజేస్తున్నాయని ఆయన అన్నారు.
కోదండరామ్‌తో స్నేహాన్ని పునరుద్ధరించుకున్నప్పటికీ తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకుల్లో ఒక్కరైన శ్రీనివాస్ గౌడ్‌ను ప్రత్యర్తిగా మార్చుకున్నారు. తెలంగాణ కవాతులో శ్రీనివాస గౌడ్ కోదండరామ్ పక్కనే ఉండి ప్రధాన పాత్ర పోషించారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్న సిపిఐ, బిజెపి వంటి పార్టీలకు తోడుగా ప్రజా సంఘాలకు చెందిన నాయకులు కొంత మంది ఆయన ప్రత్యర్థులుగా మారారు. కెసిఆర్ తమకు ప్రత్యర్థో కాదో కూడా తేల్చుకోలేని స్థితిలో కాంగ్రెసు ఉంది. కాంగ్రెసులోని కొంత మంది నాయకులు కెసిఆర్‌కు మద్దతు ఇస్తుండగా, కొంత మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం కెసిఆర్‌పై కత్తులు నూరుతున్నారు. కెసిఆర్‌ను రాజకీయంగా దెబ్బ తీయడానికి మోత్కుపల్లి నర్సింహులు వంటి నాయకులు ఏకధాటిగా కెసిఆర్‌పై తిట్ల దండకానికి ఎత్తుకున్నారు. పార్టీల మాట ఎలా ఎలా ఉన్నా ప్రజా సంఘాల వైఖరి కెసిఆర్‌కు ఏ విధమైన పరిస్థితిని కల్పిస్తుందనేది ఇప్పుడే చెప్పలేం.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications