జగన్ పార్టీలోకి టిడిపి నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు?

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడుగా వ్యవహరిస్తున్న ఉమ్మారెడ్డి కొంత కాలంగా పార్టీకి దూరం గా ఉంటున్నారు. 2009 ఎన్నికల్లో లోక్‌సభ సీటును, తరువాత రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశించిన ఉమ్మారెడ్డి అవి దక్కకపోవటంతో అసంతృప్తితో ఉన్నారు. ఉమ్మారెడ్డి పార్టీని వీడకుండా చూసేందుకు జిల్లాకు చెందిన నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
చాలా కాలంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీలో కాపులకు తగిన న్యాయం జరగలేదని ఆయన కొంత కాలం క్రితం అన్నారు. ఆయన అప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు.
తెలుగుదేశం పార్టీలో మొదటి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కీలక పాత్ర పోషించారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో, పార్టీ తీర్మానాల రూపకల్పనలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. ఎన్టీ రామారావు హయాంలో కూడా టిడిపి ముఖ్య నేతల్లో ఆయన ఒకరు.












Click it and Unblock the Notifications