టెక్కీ ఇంట్లో రూ.11 లక్షలు దోపిడీ: తాళం పగులగొట్టి..

Hyderabad
హైదరాబాద్: సికింద్రాబాదులోని చిలకలగుడూలో ఓ టెక్కీ ఇంట్లోకి దొంగలు చొరబడి 11 లక్షల రూపాయల విలువ చేసే వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన ఆదివారంనాడు జరిగింది. చిలకలగుడాలోని మేడిబావిలో గల ఆర్యసమాజచ్ భవనం పక్కన గల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రాకేష్ గౌడ్ ఇంట్లో ఈ దోపిడీ జరిగింది. రాకేష్ మాదాపూర్‌లోని నిట్ డాటా ఇంటర్నేషనల్ ఫర్మ్‌లో పనిచేస్తున్నాడు.

ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో రాకేష్ తల్లి శివానీ ఇంటికి తాళం వేసి ఉప్పల్‌లోని ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్లింది. రాకేష్ సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. ఇంట్లో దొంగతనం జరిగిన విషయం అప్పుడు తెలిసి వచ్చింది. తాళం పగులగొట్టి తలుపులు తెరిచిన ఆనవాళ్లు కనిపించాయి. ఐరన్ సేఫ్‌లోని బంగారం, నగదు పోయింది.

తమకు ఫింగర్ ప్రింట్ ఆనవాళ్లు కూడా దొరకలేదని పోలీసులు అంటున్నారు. ఫిర్యాదు మేరకు దొంగలు 20 తులాల బంగారం, ఐదు లక్షల నగదు ఎత్తుకెళ్లారు. తన సోదరుడి పెళ్లికి బంగారం కొని ఇంట్లో పెట్టామని, నగదును సిద్ధంగా ఉంచుకున్నామని రాకేష్ చెప్పాడు.

మరో సంఘటనలో దొంగలు సనత్‌నగర్‌లోని సాఫ్ట్‌వేర్ ఇంట్లో చొరబడి మూడు లక్షల విలువ చేసే వస్తువులను ఎత్తుకెళ్లారు. ఆ సంఘటన శనివారం రాత్రి జరిగింది. అవంతినగర్‌లోని అనంతరామన్ నివాసంలో ఈ సంఘటన జరిగింది. శనివారం రాత్రి రామన్ కుటుంబ సభ్యులు ఓ పెళ్లికి వెళ్లారు. ఆదివారం తిరిగి వచ్చే సరికి దొంగతనం జరిగింది. దొంగలు తొమ్మిది తులాల బంగారం ఎత్తుకెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+