వైయస్ విజయమ్మ సభలో తొక్కిసలాట: ఒకరి మృతి

తన కుమారుడు, తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను అన్యాయంగా, అక్రమంగా జైలులో పెట్టారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఆరోపించారు. సత్తుపల్లి మాజీ శానససభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు జలగం వెంకట్రావు సోమవారం విజయమ్మ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆ సందర్బంగా ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.
వైయస్ రాజశేఖర రెడ్డిది సువర్ణ యుగమని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిది స్మశాన యుగమని ఆమె అన్నారు. ప్రస్తుతం రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆమె విమర్శించారు. చంద్రబాబుపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓసారి వైయస్ రాజశేఖర రెడ్డి పాలనను గుర్తు తెచ్చుకోవాలని ఆమె చంద్రబాబుకు సూచించారు. విలువైన భూములను అప్పనంగా అప్పగించింది చంద్రబాబు కాదా అని ఆమె అడిగారు
విశ్వసనీయతకు అసలైన అర్థం వైయస్ రాజశేఖర రెడ్డి అని, విశ్వసనీయత అంటే ఏమిటో చంద్రబాబుకు తెలియదని ఆమె అన్నారు. చంద్రబాబు ఆ రోజు విద్యుత్ బకాయిలను రద్దు చేయలేదని అన్నారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదని ఆమె అన్నారు. విద్యుత్ చార్జీలు చెల్లించని రైతులను చంద్రబాబు జైలులో పెట్టించారని ఆమె విమర్శించారు. అధికారంలోకి రాగానే వైయస్ రాజశేఖర రెడ్డి రైతుల రుణాలను మాఫీ చేశారని ఆమె చెప్పారు.
పాదయాత్ర పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని విజయమ్మ వ్యాఖ్యానించారు. నల్లకాలువలో ఇచ్చిన మాట మేరకే జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని ఆమె విమర్శించారు. ప్రబుత్వాన్ని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం పని చేయడం లేదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications