జానారెడ్డికు తెలంగాణ సెగ: రిజైన్ చేయాలని కోమటిరెడ్డి

తెలంగాణ కోసం జానా రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని ఆయనను డిమాండ్ చేశారు. రాజీనామా చేసే వరకు ముందుకు కదలనిచ్చే ప్రసక్తి లేదన్నారు. దీంతో ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేయకుండానే జానా రెడ్డి వెనుదిరిగారు. మరోవైపు అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం గతంలో ఇచ్చిన హామీ మేరకు డిసెంబర్ 9వ తేదీలోగా తెలంగాణను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
లేదంటే తెలంగాణలో కాంగ్రెసు పార్టీ గల్లంతవుతుందన్నారు. కేంద్రం తెలంగాణను ప్రకటించకుంటే తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డిసెంబర్ 9లోగా తెలంగాణ ప్రకటన రాకుండే తాను రాజీనామా చేస్తానని చెప్పారు. ఆస్తుల కేసు విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఓ న్యాయం, మంత్రి ధర్మాన ప్రసాద రావుకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.
ప్రజాబలం ఉన్న నేత వైపే నాయకులు మొగ్గుచూపుతున్నారని అన్నారు. ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసులో చేరితే ఆయన నాయకత్వంలో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ విషయమై ఆయనతో చర్చిస్తామన్నారు. కాగా ఆదివారం ఆయన సోదరుడు, ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తాము జగన్‌కు అండగా ఉంటామని చెప్పిన విషయం తెలిసిందే.
హైదరాబాదులో...
ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన నేత ఇందిరా గాంధీ అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గాంధీ భవనంలో అన్నారు. ఆమె ఫోటోకు పూలమాల నివాళులు అర్పించారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా నివాళులు అర్పించారు. అనంతరం కిరణ్ నెక్లెస్ రోడ్డులో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కిరణ్, బొత్స, కెవిపిలు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లాలో..
జిల్లాలో ఇందిర గాంధీ జయంతి వేడుకల్లో వివాదం చోటు చేసుకుంది. కార్యక్రమం సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ప్రభుత్వ చీప్ విప్ గండ్ర వెంకట రమణ రెడ్డి మధ్యలోనే వెళ్లిపోయారు. కార్యకర్తలను మంత్రి బస్వరాజు సారయ్య సముదాయించారు.












Click it and Unblock the Notifications