మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసులు ఎత్తివేస్తే జగన్ చిరంజీవి దారిలోనే: చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
మెదక్: తెలంగాణకు తాను ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం మెదక్ జిల్లాలో అన్నారు. జిల్లాలో రెండో రోజు పాదయాత్ర ప్రారంభమైంది. సంగారెడ్డి మండలంలోని ఇంద్రకరణ్ నుండి యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తెలుగువారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పార్టీ టిడిపి మాత్రమే అన్నారు.

తాను ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పారు. సామాజిక న్యాయం అంటూ ఏర్పడిన పార్టీ ఇప్పటికే కాంగ్రెసు పార్టీలో కలిసిపోయిందని ప్రజారాజ్యం పార్టీని ఉద్దేశించి అన్నారు. సామాజిక న్యాయం అంటూ సొంత న్యాయాన్ని చేసుకున్నారని చిరంజీవిని పరోక్షంగా విమర్శించారు. నిన్న పిఆర్పీ రేపు వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిలు కూడా కాంగ్రెసులో విలీనం అవుతాయన్నారు.

తనపై ఉన్న కేసులు ఎత్తివేస్తే తన పార్టీని విలీనం చేసేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారన్నారు. తెరాస కూడా అదే దారిలో ఉందన్నారు. తాము అధికారంలోకి వస్తే మెదక్ జిల్లాకు మంజీరా నీరు సరఫరా చేస్తామన్నారు. కాంగ్రెసు నేతలు అడవి పందుల్లా రాష్ట్ర సంపదను దోచుకున్నారని నిప్పులు చెరిగారు. విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచుకుంటూ పోతూ సామాన్యుడిపై పెను భారం మోపుతున్నారన్నారు.

English summary
TD chief Nara Chandrababu Naidu alleged YSR Congress and TRS will merge in Congress party soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X