నాలుగు నెలల తర్వాత భూమికి సునీతా విలియమ్స్

Sunita Williams
హోస్టన్: నాలుగు నెలల పాటు అంతరిక్షంలో ఉన్న భారత - అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ సోమవారం ఉదయం ఏడున్నర గంటలకు కజకిస్తాన్‌లో భూమి పైకి దిగారు. సునీతా విలియమ్స్‌తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు ఈ ఉదయం క్షేమంగా భూమికి చేరుకున్నారు.

అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన మొదటి వ్యోమగామిగా సునీతా విలియమ్స్ నిలిచారు. రష్యా సోయజ్ కమాండర్ యూరీ మాలెస్ చెంకో, జపాన్‌కు చెందన అకీ హోషీడేలతో కలిసి సునీత కజకిస్తాన్‌లోని అర్కలిక్ పట్టణ సమీపంలో ఉదయం సోయజ్ టిఎంఏ-05 నౌకలో భూమి పైన అడుగు పెట్టారు.33వ అంతరిక్ష యాత్ర చేపట్టిన వీరు ముగ్గురు 127 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. జూలై 15వ తేదిన వారు అంతరిక్షంలోకి వెళ్లారు. అంతరిక్ష కేంద్రానికి సేవలు అందించారు. శనివాలం ఐఎస్ఎస్ నాయకత్వ బాధ్యతలను లాంఛనంగా కెవిన్ ఫోర్డ్ అనే మరో వ్యోమగామికి అప్పగించారు.

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వీరు మరమ్మతులు చేశారు. అంతరిక్షంలో సునీత ఏడుసార్లు స్పేస్ వాక్ చేశారు. కాగా సునీతా విలియమ్స్ 322 రోజుల పాటు త్వరలో అంతరిక్షంలో గడపనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+