జైలు వాకిట్లో జనం డబ్బు చెట్టు: జగన్‌పై ఫ్లెక్సీ యుద్ధం!

Guntur District
గుంటూరు: నిత్యానంద స్వామి, అవినీతిపై ఫ్లెక్లీలు ప్రదర్శించిన మూన్ సేన తాజాగా మరో ఫ్లెక్సీని గుంటూరులో ఏర్పాటు చేసింది. ఈ ఫ్లెక్సీని జైలు వాకిట్లో జనం డబ్బు చెట్టు అనే పేరుతో పొందుపర్చారు. ఇది తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని, తమ పార్టీని ఉద్దేశించినట్లుగా ఉందని ఆరోపిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

పోలీసులు వారికి నచ్చజెప్పి ఫ్లెక్సీని తీసివేయించారు. జైలు వాకిట్లో జనం డబ్బు చెట్టు అనే పేరుతో ఉన్న ఈ ఫ్లెక్సీలో దాని నిర్వాహకులు ఎన్నో అంశాలను రాశారు. అవినీతి సొమ్మంటే ఇంతటి కిక్కా, అధికారం ఇచ్చాం మనం ఓ లెక్కా, అమ్ముడుపోతుంటే ఎవరయ్యా మనకు ఇంకా దిక్కు, అందుకో ప్యాకేజ్ సర్దుకో లగేజ్, ఆకర్ష్ జాతర ప్రజాస్వామ్య విలువలకు పాతర, ఏముందో అక్కడ బెల్లం ముక్క, పోతున్నారెందుకో ఈగల్లెక్క, వేశాం వేటు ఐదేళ్లకు, మనుషుల్లెక్క... అంటూ రాశారు.

అంతేకాకుండా జైలు బొమ్మ వేసి దాని పైన చంచల్‌గూడ జైలు అని రాసి ఉంది. జైలు గోడలకు హౌస్ ఫుల్ అని రాశారు. ఇది తమ పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని, తమను ఉద్దేశించే దీనిని తయారు చేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిరసన వ్యక్తం చేసింది. తెలుగుదేశం పార్టీ వారే చేసి ఉంటారని వారు ఆరోపించారు. ఈ ఫ్లెక్సీ ఎన్టీఆర్ స్టేడియం వద్ద కనిపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+