కసబ్‌కు నరకమే ప్రాప్తిస్తుంది: బాధిత స్త్రీ నూర్జహాన్

ముంబైలోని హాజీఅలీ దర్గాను సందర్శించేందుకు వెళ్లిన నూర్జహాన్ కుటుంబీకులు నిజామాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యేందుకు 2008 నవంబర్ 26వ తేదీన ఛత్రపతి శివాజీ టెర్మినల్ (సిఎస్‌టి) రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ప్లాట్‌ఫాం మీద రైలురాక కోసం వీరంతా నిరీక్షిస్తున్న సమయంలో ఉగ్రవాదులు తెగబడి విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. దీంతో నూర్జహాన్ కుమార్తె అమీనాబేగం (20) తుపాకీ తూటాలకు బలై అక్కడికక్కడే మరణించింది. ఆమెకు అంతకు ముందు ఏడాది క్రితమే వివాహమైంది.
కూతురు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడం, ఆ తర్వాత భర్త మరణించడం వల్ల ఆమె జీవచ్ఛవంలా కాలం వెళ్లదీస్తోంది. బుధవారం అజ్మల్ కసబ్‌కు ఎరవాడ జైలులో ఉరి తీశారని ప్రసార మాద్యమాల ద్వారా తెలుసుకుని నూర్జహాన్ కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేశారు. ఆలస్యం అయినప్పటికీ తమకు న్యాయం జరిగిందని, అల్లా తమ మొరను ఆలకించాడంటూ నూర్జహాన్ కుటుంబీకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కుటుంబ సభ్యులకు మిఠాయిలు పంచి పెట్టి సంబరాలు జరుపుకున్నారు. కసబ్‌ను ఉరి తీయడం వల్ల తన కూతురు ఆత్మకు శాంతి చేకూరిందని నూర్జహాన్ అన్నారు. కసబ్‌కు నరకమే ప్రాప్తిస్తుందని ఆమె అన్నారు.
ముంబై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో నిందితుడు కసబ్‌కు ఉరిశిక్ష వేయడం పట్ల అప్పటి కాల్పుల్లో చనిపోయిన హైదరాబాదులోని నేరేడ్‌మెట్ డిఫెన్స్‌కాలనీలో నివసించే విజయ్‌రావుమంజా కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. నేరేడ్‌మెట్ డిఫెన్స్‌కాలనీకి చెందిన విజయ్‌రావుమంజా (47) ముంబయి తాజ్‌హోటల్‌లో చెఫ్‌గా పనిచేసేవారు. ఇతనికి భార్య ఫరిదామంజా, కుమారుడు రోహన్ ఉన్నారు. 2008లో ముంబయి తాజ్‌లో జరిగిన కాల్పుల్లో విజయ్‌మంజా చనిపోయాడు. అతడు మరణించిన ఆరునెలలకు బెంగతో భార్య ఫరీదా చనిపోయింది.
కుమారుడు డిగ్రీ చదువుతున్నాడు. బుధవారం కసబ్‌కు ఉరిశిక్ష పడటంతో విజయ్ మంజా సోదరుడు వినోద్ హర్షం వ్యక్తం చేశారు. చనిపోయిన తన తమ్ముడు ఎలాగు తిరిగిరాడని ఇలాంటి వారిని ఉరితీయడం వల్ల సామాన్య ప్రజల ప్రాణాలు కాపాడినవారవుతారని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications