వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని సంతకాన్ని ఫోర్జరీ చేసిన టెక్కీ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
హైదరాబాద్: ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన బిటెక్ విద్యార్థిని సిబిఐ అధికారులు హైదరాబాద్‌లో బుధవారం అరెస్టు చేశారు. లక్నో విశ్వవిద్యాలయంలో సీటును సంపాదించుకోవడానికి అతను ప్రధాని సంతకాన్ని ఫోర్జ్ చేశాడు. నిందితుడిని ఫర్హాన్ అక్తర్‌గా గుర్తించారు. ప్రిజనర్ ట్రాన్సిట్ వారంట్ ద్వారా అతన్ని ఢిల్లీకి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

లక్నో విశ్వవిద్యాలయంలో ఎంఎస్ కోసం అక్తర్ దరఖాస్తు పెట్టుకున్నాడని, ప్రధాని సిఫార్సు లేఖ అంటూ సంతకం ఫోర్జరీ చేసి దానికి జత చేశాడని సిబిఐ అధికారులు చెప్పారు. లక్నో విశ్వవిద్యాలయం అధికారులు అతనికి సీటు ఇచ్చి, సిఫార్సు మేరకు సీటు ఇచ్చామని తెలియజేస్తూ ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు.

లక్నో విశ్వవిద్యాలయం అధికారుల లేఖను చూసిన ప్రధాని కార్యాలయం అధికారులు తాము ఏ విద్యార్థికి కూడా సిఫార్సు చేయలేదని జవాబు రాశారు. విచారణ జరిపిన అనంతరం లక్నో విశ్వవిద్యాలయం అధికారులు ప్రధాని కార్యాలయానికి వివరాలను పంపించారు. ప్రధాని కార్యాలయం అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు సిబిఐ అధికారులు దర్యాప్తు చేపట్టి అక్తర్‌ను అరెస్టు చేశారు.

సిఫార్సు లేఖ రాయడానికి అక్తర్ ప్రధాని లెటర్ హెడ్‌ను ఫోర్జరీ చేశాడని సిబిఐ అధికారులు చెప్పారు. అక్తర్ హైదరాబాదులోని హిమాయత్‌నగర్‌లో గల ఓ కళాశాలలో బిటెక్ ఫైనలియర్ చదువుతున్నట్లు సమాచారం. పర్షాన్ ఖాన్ ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడని తెలుస్తోంది.

English summary

 The CBI has arrested a B.Tech student from Hyderabad on Wednesday for allegedly forging the signature of Prime Minister Manmohan Singh to secure a PG seat in Lucknow University.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X