తెలంగాణ బిల్లు ఎందుకు పెట్టలేదు?: బాబు

Chandrababu Naidu
మెదక్: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఎందుకు ప్రతిపాదించలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఎవరి మద్దతు లేకుండానే కేంద్ర ప్రభుత్వం అణు ఒప్పందం బిల్లును ఆమోదింపజేసుకుందని, అలాంటిది అందరూ అంగీకరించినప్పటికీ పార్లమెంటులో తెలంగాణపై బిల్లు ఎందుకు పెట్టలేదని ఆయన అన్నారు. చంద్రబాబు పాదయాత్ర వస్తున్నా.. మీ కోసం మెదక్ జిల్లాలో గురువారం 48వ రోజు కొనసాగింది. గురువారం ఉదయం అంతారం గ్రామం నుంచి చంద్రబాబు పాదయాత్రను ప్రారంభించారు.

తమ ప్రభుత్వ హయాంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వ్యవసాయానికి 9 గంటలపాటు నిరంతర కరెంట్ ఇచ్చామని చెప్పుకున్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, సామాన్య ప్రజలు ఏవీ కొనుక్కునే పరిస్థితి కనిపంచడంలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గ్యాస్ సబ్సీడీ ఎత్తివేసి మధ్య తరగతి ప్రజలపై మరింత భారం మోపిందని ధ్వజమెత్తారు.

పిల్లా కాంగ్రెసు (వైయస్సార్ కాంగ్రెసు)కు చెందిన పత్రికలో గీత కార్మికులను అవమానించేలా రాతలు వచ్చాయని, బెల్టు షాపులను రద్దు చేస్తానని తాను చెప్పానని, కానీ గీత కార్మికులను కూడా ఆ పత్రిక కలిపిందని చంద్రబాబు మండిపడ్డారు. కల్లుకు, బెల్టు షాపులకు సంబంధం లేదన్నారు. కల్లుని నిషేధిస్తానని తాను చెప్పలేదన్నారు. వైయస్ ఉన్నప్పుడు గీత కార్మికుల పొట్ట కొట్టాడన్నారు. అప్పుడు రెండు లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గీత కార్మికులకు లైసెన్సులు ఇస్తామన్నారు.

ప్రభుత్వానికి కాంగ్రెసు నాయకులు అల్లుళ్లుగా మారారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మెదక్ జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహపై ఆయన విరుచుకుపడ్డారు. అధికారంలో ఉండి గ్రామాల్లో కనీసం రోడ్లు కూడా వేయించలేకపోయారని మండిపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి పాలన అంతా దోచుకోవడానికే సరిపోయిందని ఆరోపించారు.

జైలుకు వెళ్లడాన్ని ఎవరైనా అవమానంగా భావిస్తారని, కాని పిల్ల కాంగ్రెసు నేతలు మాత్రం డబ్బులతో ఏమైనా చేయవచ్చునని భావిస్తున్నారని అన్నారు. తెలంగాణపై కేంద్రానికి ఇచ్చిన లేఖకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. ఇదే విషయంపై అధికారంలో ఉన్నవారిని నిలదీయాలని ఆయన సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+