చాలాబాగుంది: కిరణ్‌కు నిన్న చిరు, నేడు బొత్స కితాబు

Chiranjeevi - Botsa Satyanarayana
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలనపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశంసలు కురిపించారు. ఆదివారం మెట్రో రైలు ప్రాజెక్టు పిల్ల్రలకు దిమ్మెలు అమర్చే కార్యక్రమాన్ని కిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప్పల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బొత్స మాట్లాడారు. ప్రభుత్వం సమర్థవంతంగా పని చేస్తోందన్నారు.

మెట్రో ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటుందన్నారు. తమ పార్టీ అధిష్టానం తమకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. ప్రజా సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తోందన్నారు. అంతకుముందు క్యాంపు కార్యాలయానికి పలువురు మంత్రులు, కార్యకర్తలు వచ్చి ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున శుభాకాంక్షలు తెలియజేశారు.

పలువురు మంత్రులు, నేతల తీరును చూస్తుంటే కిరణ్‌కు దగ్గరవుతున్నట్లుగా కనిపిస్తోంది. కిరణ్‌తో కొన్నాళ్లూ దూరంగా ఉన్న బొత్స ఇటీవల ఆయనకు కితాబిస్తున్నారు. కేంద్రమంత్రి చిరంజీవి కూడా శనివారం కిరణ్ పాలనకు కితాబిచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి పాలన బాగుందని ఆయన అన్నారు. ఓ సినిమా కార్యక్రమంలో ఆయన కిరణ్ పాలనను శనివారం ప్రశంసించారు.

పలు విపత్కర పరిస్థితులు ఎదురైనా కిరణ్ కుమార్ రెడ్డి తట్టుకుని నిలబడ్డారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి సహాయంతో సినీ రంగంపై వ్యాట్‌ను తగ్గించే ప్రయత్నం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గీతా ఆర్ట్స్ కొత్త చిత్రం కార్యక్రమంలో కేంద్రమంత్రి చిరంజీవి పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+