మెట్రో రైల్‌కు చేసిందే నేను!: కిరణ్ రెడ్డిపై జైపాల్ కినుక

Kiran Kumar Reddy - Jaipal Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కిరణ్, జైపాల్‌ల మధ్య కొద్ది నెలల క్రితం ప్రచ్చన్న యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. తాజాగా మెట్రో రైలు గడ్డర్స్ ఏర్పాటు కార్యక్రమం సందర్భంగా ఆ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మెట్రో రైలు ప్రాజెక్టులో కీలకమైన సెగ్మెంట్ల ఏర్పాటు ప్రక్రియ ఆదివారం ప్రారంభమవుతుంది.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లాంఛనంగా ఈ గడ్డర్స్ ఏర్పాటు పనులను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా తనకు ఆహ్వానం అందలేని జైపాల్ రెడ్డి కిరణ్ పైన కినుక వహించారు. తనను ఆహ్వానించక పోవడమే కాకుండా పత్రికా ప్రకటనలో తన ఫోటో లేకపోవడం కూడా ఆయనకు ఆగ్రహం తెప్పించింది. మెట్రో రైలు ప్రాజెక్టు గిడ్డర్స్ విషయం తనకు నిన్న సాయంత్రమే చెప్పారని జైపాల్ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లుగా సమాచారం.

ఈ ప్రాజెక్టు కోసం ప్లానింగ్ కమిషన్‌ను ఒప్పించిందే తను అని అలాంటిది తననే విస్మరించడం ఏమిటని ఆయన కిరణ్ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. తన సేవలనే విస్మరించడం ఏమిటని ఆయన సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారట. రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అయిన జైపాల్ రెడ్డిని కిరణ్ విస్మరించడం సరికాదని కేంద్రమంత్రి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. కేవలం తూతు మంత్రంగా ఆహ్వానపు లేఖ అందిందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+