వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతికి కేశవ్ డిమాండ్: ఫి.స. చీఫ్‌గా జగన్..సోమిరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Payyavula Keshav - Somireddy
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి అదే బహిరంగ లేఖ ద్వారా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో కుదుర్చుకున్న రహస్య ఒప్పందాన్ని కూడా బయట పెట్టాలని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ శనివారం డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెండేళ్ల పాలన విఫల గాథ అన్నారు. ఆయన ప్రజల గురించి తక్కువగా కుర్చీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారన్నారు. రాజకీయాల్లో ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాల్సి ఉంటుందన్నారు. కానీ కిరణ్ మాత్రం తాను మారేదే లేదన్నట్లుగా చెబుతున్నారన్నారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఫిరాయింపుదారుల సమాఖ్య అధ్యక్షుడిగా చేయాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించాడు. ఫిరాయింపుదారులతో జగన్ రాజకీయం చేస్తున్నారన్నారు. ఇలాంటి వారికి భవిష్యత్తు ఉండదని, అవినీతి, కుంభకోణాల చరిత్ర ఉన్న పార్టీలోకి వెళ్లే నేతలకు ఎలాంటి ప్రయోజనం కలగదన్నారు. సిద్ధాంతాలు, లక్ష్యాలు లేని పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అన్నారు.

తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని జగన్ రాష్ట్రాన్ని దోచుకున్నాడని, ముఖ్యమంత్రి అయితే అవినీతికి పాల్పడటం తప్పితే మరేం చేయరని ఆరోపించారు. జగన్ పార్టీలోకి వలస వెళ్లే నాయకులు ఆ పార్టీలోకి ఎందుకు వెళ్తున్నారో ఒక్క మంచి కారణమైనా చెప్పగలరా అని ప్రశ్నించారు.

English summary
TD leader Payyavula Keshav has questioned YSR Congress party chief YS Jaganmohan Reddy's sister YS Sharmila.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X