10కె రన్‌లో మెరిసిన చిరంజీవి, సానియా మీర్జా

Chiranjeevi and Sania Mirza
హైదరాబాద్: నెక్లెస్ రోడ్డులో ఆదివారం జరుగుతున్న 10కె రన్‌లో కేంద్రమంత్రి చిరంజీవి, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మెరిశారు. వారిద్దరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్, నగర పోలీసు కమిషనర్ అనురాగ శర్మ, టెన్నిస్ కోచ్ పుల్లెల గోపీచంద్ పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు. పరుగు ద్వారా మనం ఎంతో ఆరోగ్యంగా తయారవుతామని చిరంజీవి చెప్పారు.

ఇలాంటివి మరిన్ని జరగాల్సిన అవసరము ఉందన్నారు. 10కె రన్ ద్వారా హైదరాబాదును ప్రపంచానికి తెలియజేయాలని నాదెండ్ల మనోహర్ తెలియజేయాలన్నారు. దీనిని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారన్నారు. హైదరాబాదీలు 10కె రన్‌లో పాల్గొని తమ హెల్త్ ఫిటన్‌నెస్‌ను నిరూపించుకుంటున్నారని సానియా మీర్జా అన్నారు. ఇది చాలా బాగుందనన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు ఫిట్‌నెస్ పైన అవగాహన పెంపొందించేందుకు ఉపయోగపడతాయన్నారు.

కాగా ఉదయం 10కె రన్‌ను నాదెండ్ల మనోహర్, కమిషరన్ అనురాగ్ శర్మ ప్రారంభించారు. చిరంజీవి పరుగులో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. 10కె రన్ దృష్ట్యా నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండు పరిసర ప్రాంతాల్లో ఈ ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

జంబో క్లౌడ్ పరుగులో విజేతగా షైనీ రతీరాం నిలిచారు. రెండు మూడు స్థానాల్లో లక్ష్మణ్, రావర్ట్ నితేంధర్ సింగ్ నిలిచారు. మహిళల విభాగంలో సుధా సింగ్ ప్రథమ స్థానంలో నిలిచారు. ఎలాంటి అవతకవతకలు జరగకుండా చిప్‌లు ఏర్పాటు చేశారు. నగర ప్రజలు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+