జైల్లోల్యాప్‌టాప్ ఉపయోగిస్తున్నజగన్: గవర్నర్‌కు టిడిపి

విఐపి ఖైదీ జగన్‌తో కొందరు జైలు అధికారులు కుమ్మక్కై ఇంటర్నెట్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారని, జగన్‌ను కలిసేవారి ములాఖత్‌ల రికార్డుల్ని అధికారులు సరిగా నిర్వహించడం లేదని పేర్కొన్నారు. నిబంధనల ఉల్లంఘన, జగన్‌కు సౌకర్యాలపై ఫిర్యాదు చేసినా జైళ్ళ శాఖ స్పందించలేదన్నారు. సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకూ సమాచారం ఇవ్వాలేదని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లారు. గవర్నర్‌కు రాసిన లేఖను ముఖ్యమంత్రికి కూడా పంపారు.
మద్యం కుంభకోణంపై శోభా హైమావతి
కాగా మద్యం కుంభకోణం వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి డిమాండ్ చేశారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో మంత్రులను తప్పించి అధికారుల్ని బలి చేయడమేమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణకు మధ్య ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజీ కుదుర్చడంతో అధికారులు బలి అవుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications