అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీ నేతల చరిత్ర తెలుసు: చిరంజీవి, బాబుపై ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల చరిత్ర అందరీకు తెలుసునని కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు. మంగళవారం ఆయన అనంతపురం జిల్లాలో హంద్రీనీవా ప్రాజెక్టు 8వ పంప్ హౌస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హంద్రీనీవా ప్రాజెక్టుతో రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. సీమ ప్రాంతానికి తాగు, సాగు నీరు అందుతుందన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు నాలుగు జిల్లాలకు నీటి కొరత తీర్చనుందని చెప్పారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రైతులను విస్మరించారని విమర్శించారు. ఇప్పుడు ఆయన వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేస్తూ రైతుల కోసం తాను పాటుపడతానని చెబితే ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. రాయలసీమ ప్రాంతంలోని జిల్లాలు ఈ హంద్రీనీవా ప్రాజెక్టు కారణంగా పచ్చని పైర్లతో కలకలలాడనుందని చిరంజీవి అన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు రఘువీరా రెడ్డి, శైలజానాథ్, మాణిక్య వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల చరిత్ర గురించి అందరికీ తెలుసునని చెప్పారు. కాగా ఆయన స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

కాగా 2014 ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతాయని మంత్రి బసవరాజు సారయ్య హైదరాబాదులో ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అన్ని రకాలుగా అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 9 లోపు తెలంగాణ వస్తుందని తాను ఆశిస్తున్నానని తెలిపారు. ఒక వేళ డిసెంబర్ 9లోపు తెలంగాణపై ప్రకటన రాకపోతే తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.

English summary
Central Minister Chiranjeevi said all the people of Andhra Pradesh are know about YSR Congress party leaders history.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X