జగన్‌కు మళ్లీ చుక్కెదురు: బెయిల్ పిటిషన్ తిరస్కరణ

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో బుధవారం చుక్కెదురయింది. జగన్‌కు కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. జగన్ పన్నెండు రోజుల క్రితం స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన కోర్టు సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందన్న, అరెస్టు అక్రమం కాదన్న సిబిఐ వాదనతో ఏకీభవించి ఆయన బెయిల్‌ను తిరస్కరించింది. జగన్ కేసులో తాము సుప్రీం ఆదేశాలను పాటించామని తెలిపింది. అనంతరం మరో బెయిల్ పిటిషన్ పైన తీర్పును ఎల్లుండికి వాయిదా వేసింది.

వైయస్ జగన్ స్టాట్యూటరి బెయిల్, సాధారణ బెయిల్ రెండు అప్పుడు దాఖలు చేశారు. నిర్ణీత గడువులోగా సిబిఐ ఛార్జీషీట్ దాఖలు చేయలేదని జగన్ తన బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. దర్యాఫ్తు పేరిట సిబిఐ కాలయాపన చేస్తోందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తనను అరెస్టు చేసి 90 రోజులు దాటినప్పటికీ సిబిఐ ఛార్జీషీట్ ఇంకా దాఖలు చేస్తూ కాలయాపన చేస్తోందన్నారు. సిఆర్‌పిసి సెక్షన్ 167(2) కింద తాను బెయిల్ పొందేందుకు అర్హుడనని జగన్ అందులో పేర్కొన్నారు.

అనంతరం దీనిపై సిబిఐ కౌంటర్ కూడా దాఖలు చేసింది. వైయస్ జగన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌కు సిబిఐ గత శుక్రవారం హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. వైయస్ జగన్‌కు బెయిల్ ఇవ్వకూడదని సిబిఐ కోర్టును కోరింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను వక్రీకరించి, జగన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని విమర్శించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు బెయిల్ కోసం కోర్టుకు రాకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ దాన్ని వక్రీకరిస్తూ జగన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని వాదించింది.

వైయస్ జగన్ బెయిల్ మంజూరుకు అనర్హుడని సిబిఐ అభిప్రాయపడింది. వైయస్ జగన్ ఆస్తుల కేసు దర్యాప్తునకు తమకు ఇంకా కొంత సమయం పడుతుందని, ఏడు అంశాలపై దర్యాప్తు సాగుతోందని చెప్పింది. దర్యాప్తు పూర్తి చేసి, చార్జిషీట్ దాఖలు చేయడానికి తమకు ఇంకా సమయం ఉందని సిబిఐ చెప్పింది. జగన్‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తాడని, సాక్షులను ప్రభావితం చేస్తాడని అభిప్రాయపడింది. కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి, జగన్ బెయిల్ పిటిషన్ వేశాడని చెప్పింది. కొన్ని నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+