హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జైలు గోడలు బద్దలు కొడ్తామన్నా చర్యలేవి: విహెచ్ ప్రశ్న

By Srinivas
|
Google Oneindia TeluguNews

V Hanumanth Rao
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని జైలు గోడలు బద్దలు కొట్టి తీసుకుపోతామన్న ఆ పార్టీ నేతలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు బుధవారం ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు.

నేతల వ్యాఖ్యలపై పోలీసులు స్పందించరేమిటని ప్రశ్నించారు. రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల వ్యాఖ్యలపై చర్యలు తీసుకోని పక్షంలో తీవ్ర పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌లు నిజాయితీకే పట్టం కట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

అలాంటి సమయంలో మంత్రి ధర్మాన ప్రసాద రావును రక్షించే ప్రయత్నాలు చేయడం సరికాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైఖరిని తప్పు పట్టారు. మంత్రి ధర్మానను సిబిఐ విచారణకు అనుమతించాలని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా జైలు గోడలు బద్దలు కొట్టి జగన్‌ను తీసుకు వెళ్తారని జగన్ పార్టీ నేతలు చెప్పగా... ధర్మాన విచారణకు రాష్ట్ర కేబినెట్ తిరస్కరించిన విషయం తెలిసిందే.

రేవంత్ రెడ్డిపై శ్రీధర్ బాబు ఫైర్

రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌పై వ్యక్తిగత విమర్శలు సరికాదని మంత్రి శ్రీధర్‌బాబు టిడిపి అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డికి హితవు పలికారు. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్‌కు పార్టీ రంగులు పూయడం తగదని హితవు చేశారు. అసంతృప్తి నేతలతో అధిష్టానం మాట్లాడుతుందని, పెద్దిరెడ్డి వ్యవహారం చిన్న ఇబ్బందిగా ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఎంపిలు హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తున్నారని శ్రీధర్‌బాబు తెలిపారు.

English summary
Congress party senior leaders V Hanumanth Rao has demanded state government and police department to take action against YSR Congress party leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X