కెసిఆర్ రాష్ట్రంకోసం వెళ్లలేదు: బాబు, జగన్ బెయిల్‌పైనా

కెసిఆర్ పైరవీల కోసమే ఢిల్లీ పర్యటనలు చేశారే తప్ప తెలంగాణ కోసం కాదని ఆరోపించారు. తెలుగవారి ఆత్మగౌరవాన్ని, పరువును కెసిఆర్ ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. టిడిపి తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి కళ్లముందు కనిపిస్తుంటే బెయిల్ ఎలా వస్తుందని చంద్రబాబు అన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసి జగన్ బయటపడాలనుకున్నారని కానీ కుదరలేదన్నారు. రాష్ట్రం కోసం రాత్రింబవళ్లు కష్టపడిన తనకు విశ్వసనీయత లేదని షర్మిల తన పాదయాత్రలో అనడం విడ్డూరంగా ఉందన్నారు. జైలుకు పోయిన వారిని ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. అవినీతి లేకుండా ఉద్యోగాలు కల్పించిన ఘనత కేవలం తెలుగుదేశం పార్టీది మాత్రమేనన్నారు.
ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఇష్టపడని వారు తన పాదయాత్రపై విమర్శలు గుప్పించడం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కాగా చంద్రబాబు పాదయాత్ర ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో ప్రవేశించనుంది.
కాగా అంతకుముందు చంద్రబాబు నాయుడితో అసెంబ్లీ స్టాటజీ కమిటీ బుధవారం ఉదయం భేటీ అయింది. అసెంబ్లీలో ఆచరించాల్సిన వ్యూహంపై వారు చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అనంతరం మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications