అజ్మల్ కసబ్ ఉరి: హైదరాబాదులో తాలిబన్ల సంచారం?

కసబ్ మృతిని వృధా కానీయమని, తమ వాళ్లు హైదరాబాద్, అమృత్‌సర్ నగరాల్లో తిరుగుతున్నారని వారు త్వరలో ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారని రాసింది. ఒక్క కసబ్ మృతికి ఆవేదన చెందిన ఎందరో ఇప్పుడు బలిదానానికి సిద్ధంగా ఉన్నారని తెలిపిందని రాసింది.
తెహ్రిక్ ఏ తాలిబన్ గ్రూపుకు చెందిన అధికార ప్రతినిధి హెచ్చరించడంతో ఇంటలిజెన్స్ నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. హైదరాబాద్, అమృతసర్‌లతో పాటు దేశం నలుమూలలా భద్రతను కట్టుదిట్టం చేస్తూ.. అడుగడుగునా తనిఖీలు ముమ్మరం చేశారు ఉగ్రవాది కసబ్‌ను ఉరి తీసిన వెంటనే భారత్ పైన దాడులు తప్పవని తాలిబన్లు హెచ్చరించిన విషయం తెలిసిందే.
కాగా ప్రజలు ఎవరూ భయాందోళనలకు గురి కావొద్దని హైదరాబాద్ సిపి అనురాగ్ శర్మ సూచించారు. ఐటి కంపెనీలకు, ప్రజలకు తాము తగిన రక్షణ కల్పిస్తామని, పోలీసులు బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని అన్నారు.












Click it and Unblock the Notifications