నిజాలు చెప్పాల్సి వస్తుంది: జగన్ పార్టీకి పయ్యావుల

Payyavula Keshav
హైదరాబాద్: మీరు మా గురించి అబద్దాలు చెబితే మేం మీ గురించి నిజాలు చెప్పాల్సి వస్తుందని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ శుక్రవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీని హెచ్చరించారు. ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ పార్టీ నేతలు నిత్యం కడపకు ఢిల్లీకి తిరుగుతున్నారని, దీనిని బట్టే ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారో అర్థమవుతోందన్నారు.

తెలుగుదేశం పార్టీ పాలన పైన తాము ఎలాంటి చర్యకైనా సిద్ధమని సవాల్ విసిరారు. కాంగ్రెసు పార్టీతో వైయస్సార్ కాంగ్రెసు తమ చీకటి ఒప్పందాల బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పాలిస్తున్న కాంగ్రెసును వదిలేసి.. పదేళ్ల క్రితం పాలించిన చంద్రబాబును విమర్శించడమేమిటని ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీ పైన, రాబర్ట్ వాద్రా, రాహుల్ గాంధీ పైన ఎందుకు విమర్శలు చేయలేకపోతున్నారని అడిగారు.

తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును చూసి జగన్ పార్టీలో వణుకు పుడుతోందని, అందుకే కాంగ్రెసును వదిలేసి టిడిపిని టార్గెట్ చేసుకున్నారన్నారు. తాను గానీ, తమ పార్టీ గానీ ఎవరితోనూ రహస్య ఒప్పందాలు చేసుకోలేదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మొన్న తనపై మైండ్ గేమ్ అడి... ఇప్పుడు బ్లాక్ మెయిల్ గేమ్ ఆడుతోందని విమర్శించారు. వైయస్ విజయమ్మ బైబిల్ చేతిలో పట్టుకొని అబద్దాలు ప్రచారం చేస్తోందన్నారు.

చంద్రబాబుకు కోర్టులే క్లీన్ చిట్ ఇచ్చాయని, అయినప్పటికీ వారు విష ప్రచారం చేస్తున్నారని, గోబెల్స్ ప్రచారం మానుకోకుంటే మీ గురించి నిజాలు చెప్పవలసి వస్తుందన్నారు. శోభా నాగి రెడ్డి విమర్శలు హాస్యాస్పదం అన్నారు. జగన్‌ను జైలులో పెట్టింది కోర్టులో లేక తెలుగుదేశం పార్టీయా అని ప్రశ్నించారు. ఎస్ఆర్ మినరల్స్ సురేంద్ర వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డికి సన్నిహితుడు అని ఆయనను అడిగి తెలుసుకోవాలన్నారు.

షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఎవరి కోసమో చెప్పాలన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు మొదట సుప్రీం కోర్టు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పదే పదే అబద్దాలు చెబితే ప్రజలు నమ్మరన్నారు. అసలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు ఎవరో చెప్పాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+