బెట్టు వెనక: జగన్ పార్టీ మనవడి కోసం కావూరి త్యాగం!

Kavuri Sambasiva Rao
హైదరాబాద్: తనకు కేంద్ర మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వలేదని ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు అసంతృప్తికి గురై రాజీనామా సమర్పించేందుకు సిద్ధపడినప్పటి నుండి అతనిపై వివిధ రకాల ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ఆయన నియోజకవర్గంలో కావూరి అంశం చర్చనీయాంశమైంది. మొదట అసంతృప్తి చెందినప్పటికీ తన కూతురుకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తానని అధిష్టానం హామీ ఇవ్వడంతో ఆయన వెనక్కి తగ్గారనే వార్తలు వచ్చాయి.

అయితే ఆ తర్వాత కూడా కావూరి తన అసంతృప్తిని బయటపెట్టారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ భేటీ తర్వాత కూడా ఆయన రాజీనామాకే కట్టుబడి ఉన్నానని ప్రకటించారు. ఇటీవల ఏకంగా కొల్లేరు సమస్యపై ప్రభుత్వంతో ఢీకొనేందుకు సిద్ధమయ్యారు. సమస్యను తీర్చని పక్షంలో తాను భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తానని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో కావూరి కాంగ్రెసును వీడేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు జోరందుకున్నాయి.

అదే సమయంలో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారనే ప్రచారం కూడా జరిగింది. దీనిపై మాత్రం అతను పెదవి విప్పటం లేదు. తాజాగా ఆయన నియోజకవర్గంలో మరో చర్చ జరుగుతోంది. జగన్ పార్టీలో ఉన్న తన మనవడి కోసం కావూరి కాంగ్రెసు పార్టీలో త్యాగానికి సిద్ధమవుతున్నారా అనే చర్య సాగుతోంది. కావూరి మనవరాలి భర్త(మనవడు) రాజీవ్ ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.

ఆయన వచ్చే ఎన్నికల్లో ఏలూరు పార్లమెంటు స్థానం నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారట. ఏలూరు నుండి కావూరి వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కావూరి తన మనవడి కోసం కాంగ్రెసు పార్టీపై బెట్టు చేస్తూ శాక్రిఫైస్(త్యాగం) చేస్తున్నారని చెవులు కొరుక్కుంటున్నారు. కావూరి విస్తరణ జరిగే ప్రతిసారి తనకు అవకాశం వస్తుందని భావిస్తూనే ఉన్నారు.

ప్రతిసారి చుక్కెదురవుతుంది. కానీ ఈసారి మాత్రం అతను బెట్టు చేయడం వెనుక ఎంతో 'రాజీ'కీయం ఉండవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అదే సమయంలో కావూరి వర్గం మాత్రం దీనిని ఖండిస్తోంది. సోనియా గాంధీ మాత్రమే పిలిస్తే వెళతానని ఇప్పటికే కావూరి చెప్పారని, అలాంటప్పుడు వేరే పార్టీలోకి వెళ్తారనే ప్రచారానికి, బెట్టు అనే దానికి అర్థం లేదని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+